మరణానికి ముందు రోజు సుశాంత్‌తో నిర్మాత కాన్ఫరెన్స్‌.. ఏం మాట్లాడాడు?

By Satish ReddyFirst Published Aug 11, 2020, 6:18 PM IST
Highlights

రెండు నెలలుగా సుశాంత్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. సుశాంత్ ది హత్యా , ఆత్మ హత్యా అనే కోణంలో విచారణ సాగుతుంది. కాగా సుశాంత్ మరణానానికి ముందు రోజు అతనితో మాట్లాడానని నిర్మాత రమేష్ తౌరాని ట్విట్టర్ లో కొన్ని కీలక విషయాలు తెలియజేశారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఓ క్రైమ్ థ్రిల్లర్ లా సాగుతుంది. ఆయన మరణం తరువాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు  తండ్రి కేకే సింగ్ వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఇవ్వడం జరిగింది. సీబీఐ అధికారులు సుశాంత్ మరణాన్ని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, ఈ కేసులో ప్రధాన నిందితులుగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్న రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆయన మాజీ మేనేజర్స్ ని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. సుశాంత్ అకౌంట్ నుండి భారీగా నగదు చేతులు మారినట్లు సమాచారం ఉండగా, వీరిని ఈడీ సైతం విచారిస్తుంది.  

కాగా సుశాంత్ మరణానికి ముందు రోజు ఆయనతో ఫోన్ లో మాట్లాడానంటూ ఓ బాలీవుడ్ నిర్మాత ట్వీట్ చేశారు. జూన్ 14న ఆదివారం సుశాంత్ తన నివాసంలో శవంలా కనిపించగా, 13న నిర్మాత రమేష్ తౌరాని సుశాంత్ తో ఫోన్ లో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆరోజు జరిగిన విషయాన్ని కూలంకషంగా వివరించారు. మరో నిర్మాత నిఖిల్ అద్వానీతో కలిసి కాన్ఫరెన్స్ కాల్ లో సుశాంత్ కి ఓ కథ చెప్పడం జరిగింది అన్నారు. అలాగే ఆ కాన్ఫరెన్స్ కాల్ లో సుశాంత్ మేనేజర్ ఉదయ్ కూడా ఉన్నారట. ఇక రమేష్ తౌరాని చెప్పిన కథకు సుశాంత్ ఆసక్తి చూపించారట. ఓ మూవీ విషయమై తమ మధ్య ప్రాధమిక చర్చలు జరిగినట్లు రమేష్ ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. 

రిపోర్టర్ అప్పటి సుశాంత్ మానసిక పరిస్థితి గురించి అడగడంతో దానికి నిర్మాత రమేష్ తౌరాని, ఒక ప్రొఫెషనల్ కాల్ లో ఎదుటవారి మానసిక స్థితిని అంచనా వేయడం కష్టం అని చెప్పారట. దానికి తోడు, ఆ కాల్ కూడా కేవలం 15 నిమిషాలలో ముగిసినట్లు ఆ నిర్మాత తెలియజేశారు. మరణానికి ముందు రోజుకూడా ఓ సినిమా ఆఫర్ విషయంపై నిర్మాతలతో చర్చలు జరిపిన సుశాంత్ కి ఆత్మ హత్య చేసుకోవాల్సిన అవసరం ఏమైవుంటుందన్న ఆసక్తి అందరిలో పెరిగిపోతుంది. చివరిగా శుశాంత్ మరణంపై ఒకరిని ద్వేషించడం పనికిరాదు అన్నారు. విచారణ జరుగుతున్న నేపథ్యంలో వ్యవస్థలపై నమ్మకం ఉంచి, ఎదురుచూడండి అన్నారు. 

click me!