సింహం గర్జిస్తే ఢిల్లీ షేప్‌ మారిపోతుంది.. బాలయ్య డైలాగ్‌కి, ఎన్టీఆర్‌ క్లిప్స్.. వీడియో వైరల్‌

Published : Jan 18, 2021, 04:17 PM IST
సింహం గర్జిస్తే ఢిల్లీ షేప్‌ మారిపోతుంది.. బాలయ్య డైలాగ్‌కి, ఎన్టీఆర్‌ క్లిప్స్.. వీడియో వైరల్‌

సారాంశం

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 25వ వర్థంతి నేడు(సోమవారం). ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందిస్తూ, ఎన్టీఆర్‌తోనే ఆవేశం పుట్టిందన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ నేటికీ.. ముమ్మాటికీ ద్రువ తార మీరే` అని జూ.ఎన్టీఆర్‌ కొనియాడారు. నివాళులు అర్పించారు.

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 25వ వర్థంతి నేడు(సోమవారం). ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సినిమాపై ఆయన వేసిన ముద్రని చాటుకుంటున్నారు. బాలకృష్ణ స్పందిస్తూ, ఎన్టీఆర్‌తోనే ఆవేశం పుట్టిందన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ నేటికీ.. ముమ్మాటికీ ద్రువ తార మీరే` అని జూ.ఎన్టీఆర్‌ కొనియాడారు. నివాళులు అర్పించారు.

ఇక నిర్మాత రామ్‌ ఆచంట విభిన్నంగా స్పందించారు. `మరణం లేని జననం` అని పేర్కొంటూ బాలకృష్ణ డైలాగ్‌తో, ఎన్టీఆర్‌ సీన్స్ తో మేళవించిన వీడియోని పంచుకున్నారు. ఇందులో `లెజెండ్‌` చిత్రంలోని బాలకృష్ణ డైలాగ్‌కి ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేసిన నాటి సీన్లని కలిపారు. `సింహం నిద్ర లేచి, గడపదాటి జనంలోకి వచ్చి గర్జిస్తే, ఆ గర్జనకు ఢిల్లీ మ్యాప్‌ షేపే మారిపోతుంది` అని బాలకృష్ణ ఆవేశంతో అనగా, ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి సంబంధించిన సన్నివేశాలు, ఆవేశంతో కూడిన హవాభావాలు, ఎన్నికల ప్రచారంలోని క్లిప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. కాగా బాలకృష్ణ నటించిన `లెజెండ్‌` చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీఆచంట నిర్మించారు. ప్రస్తుతం 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్‌పై సినిమాలు చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే