హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!

Published : May 18, 2020, 09:06 PM IST
హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!

సారాంశం

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన పొట్లూరి వరప్రసాద్ పేరు మెన్షన్‌ చేయకుండా బండ్ల గణేష్‌ మీద సెటైర్లు వేశాడు. `పైన ఉన్న అమ్మవారు.. కింద ఉన్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్రేడు బాబు ఇకపై నీతో సినిమా తీయడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిం కూడా తీయలేడు` అంటూ కామెంట్‌ ఇచ్చాడు.

ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగ రాసిన భారీ చిత్రం గబ్బర్‌ సింగ్‌. ఈ సినిమా తో నిర్మాత స్టార్ ఇమేజ్‌ అందుకున్నాడు బండ్ల గణేష్‌. పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ శంకర్‌ దర్శకుడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 8 సంవత్సరాలు అయిన సందర్భంగా మరోసారి ఈ సినిమా మీద భారీగా చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్‌, నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. హరీష్ రీమేక్‌లతోనే హిట్లు కొట్టగలడు అంటూ గణేష్ కామెంట్ చేయటంతో వివాదం మొదలైంది.  ఈ కామెంట్స్‌ మీద హరీష్ కూడా ఘాటుగానే స్పందించాడు.

అంతేకాదు మరో ఇంటర్వ్యూలో ఏకంగా భవిష్యత్తులో గణేష్‌తో సినిమా చేయనంటూ ప్రకటించాడు గణేష్‌. అయితే ఈ వార్తలపై హరీష్‌ స్పందించకపోయినా ఓ బిగ్ ప్రొడ్యూసర్‌ ఈ వివాదంలోకి తల దూర్చాడు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన పొట్లూరి వరప్రసాద్ పేరు మెన్షన్‌ చేయకుండా బండ్ల గణేష్‌ మీద సెటైర్లు వేశాడు. `పైన ఉన్న అమ్మవారు.. కింద ఉన్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్రేడు బాబు ఇకపై నీతో సినిమా తీయడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిం కూడా తీయలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలను మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి.. వెయిటింగ్‌. హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!` అంటూ ట్వీట్ చేశాడు పీవీపీ.

ఈ ట్వీట్ పై హరీష్ మాత్రం హుందాగా స్పందించాడు. మీ భాష, భావం రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని ఫైట్లే అక్కర్లేదు, ట్వీటు చాలు అని నిరూపించారు. మీ రేంజ్‌ మ్యాచ్‌ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు` అంటూ రిప్లై ఇచ్చాడు. గతంలో బండ్ల గణేష్‌ నిర్మించిన టెంపర్ సినిమాకు పీవీపీ ఫైనాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా సమయంలో బండ్ల గణేష్‌, పీవీపీల మధ్య గొడవ మొదలైంది. ఆ కారణంగానే పీవీపీ ఈ ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్‌ నుంచి ఆది వరకు
Gunde Ninda Gudi Gantalu: నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నావా? రోహిణీని ప్రశ్నించిన మనోజ్, ప్రభావతిలోనూ అనుమానం