బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘పఠాన్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్ కు నిర్మాత నవీన్ యెర్నెని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ మల్టీస్టారర్స్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘వార్’, ‘పఠాన్’ వంటి చిత్రాను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anad) దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ గ్రీక్ వీరుడు Hrithik Roshan కలిసి నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నారని సమాచారం.
అయితే, తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నెనీ (Naveen Yerneni) దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రత్యేకంగా కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘పఠాన్’ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో ప్రొడ్యూసర్ నవీన్ ఆయన్ని కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక మైత్రీ సంస్థ తరుపున శుభాకాంక్షలు తెలపడంతో.. ప్రభాస్, హృతిక్ ల మల్టీస్టారర్‌ని నిర్మాత కన్ఫమ్ చేసినట్టేగా అంటూ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
థియేటర్లలోకి వచ్చిన ‘పఠాన్’ (Pathaan) మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే టాక్ ను దక్కించుకొని.. బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపుతోది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సెకండ్ వీక్ లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో జోష్ కనబరుస్తూ రూ.1000 కోట్ల దిశగా అడుగులేస్తోంది. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొణె తోపాటు జాన్ అబ్రహం అదరగొట్టడంతో నార్త్ ఆడియెన్స్ కు యాక్షన్ ట్రీట్ అందినట్టైంది.
ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్ తో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం ప్రభాస్ - హృతిక్ మల్టీస్టారర్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాటు ఫ్రాంచైజీలుగానూ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఇప్పటి వరకు రానీ, కనీవిని ఎరుగని విధంగా ఈ సినిమాని తెరకెక్కించాలని సిద్ధార్థ్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Our Producer Garu met & congratulated BOLLYWOOD'S happening BLOCKBUSTER director for the super success of 💐 pic.twitter.com/11Dh5hQfcF
— Mythri Movie Makers (@MythriOfficial)