పాత్ర చేసేటప్పుడు అది మాత్రమే కనిపించాలి... యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

By Sambi ReddyFirst Published Mar 26, 2024, 3:16 PM IST
Highlights

యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటిగా తనకు ప్రియాంక చోప్రా స్ఫూర్తి అన్న ఆమె, అందుకు కారణం వివరించారు. 
 

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది త్రిప్తి డిమ్రీ. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీలో త్రిప్తి డిమ్రీ చిన్న పాత్ర చేసింది. చెప్పాలంటే వ్యాంప్ క్యారెక్టర్ లాంటిది. త్రిప్తి డిమ్రీ పాత్రకు పెద్దగా నిడివి లేదు. అయినప్పటికీ పాప్యులర్ కావడానికి కారణం... ఆమె మితిమీరిన ఇంటిమేట్ సీన్స్ లో నటించింది. రన్బీర్ కపూర్-త్రిప్తి డిమ్రీ మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్స్ రూపొందించారు. తెగించి నటించిన త్రిప్తి డిమ్రీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 

హీరోయిన్ రష్మిక మందాన కంటే కూడా యానిమల్ విషయంలో త్రిప్తి డిమ్రీ పేరు గట్టిగా వినిపించింది. త్రిప్తి డిమ్రీ తాజాగా నటి ప్రియాంక చోప్రా పై ప్రశంసలు కురిపించింది. ప్రియాంక చోప్రా తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది. ఇతర పరిశ్రమలకు వెళ్లి సక్సెస్ కావాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంక చోప్రాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే హాలీవుడ్ లో ఆమె సక్సెస్ అయ్యారు. 

ప్రియాంక చోప్రా నటించిన బర్ఫీ మూవీ చూశాను. ఆమెను నేను గుర్తించలేకపోయాను. ఒక నటికి కావలసిన లక్షణం అదే.ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రలతో మనల్ని పిలుస్తుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు... అని త్రిప్తి డిమ్రీ అన్నారు. 

శ్రీదేవి ప్రధాన పాత్రలో 2017లో విడుదలైన మామ్ మూవీతో త్రిప్తి డిమ్రీ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. లైలా మజ్ను చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారింది. క్వాలా ఆమెకు ఫేమ్ తెచ్చింది. త్రిప్తి డిమ్రీ యానిమల్ మూవీలో అలా కనిపించడం ఓ వర్గాన్ని షాక్ కి గురి చేసింది. 
 

click me!