దిల్ రాజు హర్ట్ అయ్యాడట!

Published : Aug 06, 2018, 03:34 PM IST
దిల్ రాజు హర్ట్ అయ్యాడట!

సారాంశం

'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో కూడా ఇదే జరిగిందని, దర్శకుడు సతీష్ వేగ్నేశని బాగా విసిగించారని టాక్. అయితే ఈ వార్తలు దిల్ రాజు వరకు వెళ్లడంతో ఆయన కాస్త సీరియస్ అయ్యాడు. తను ఈ విషయంలో చాలా బాధ పడినట్లు, ఇకపై ఇలాంటి వార్తలు రాయొద్దంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన సినిమాను నిర్మించడంతో పాటు డైరెక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడని అప్పుడప్పుడు వార్తలు బయటకి వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మరింత ఎక్కువైందని, కొత్త దర్శకులతో ఆయన వ్యవహార శైలి మరింత కఠినంగా ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి.

'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో కూడా ఇదే జరిగిందని, దర్శకుడు సతీష్ వేగ్నేశని బాగా విసిగించారని టాక్. అయితే ఈ వార్తలు దిల్ రాజు వరకు వెళ్లడంతో ఆయన కాస్త సీరియస్ అయ్యాడు. తను ఈ విషయంలో చాలా బాధ పడినట్లు, ఇకపై ఇలాంటి వార్తలు రాయొద్దంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. 'నేను దర్శకుల వెనుక మాత్రమే ఉంటాను. మేమంతా కలిసి పని చేస్తాం.

ఓ కథ విన్న తరువాత దర్శకుడిగా నేను కూడా ట్రావెల్ చేస్తాను. ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు' అని అన్నారు. ఆయన నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పాడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్