Bheemla Nayak: రిలీజ్‌పై కన్‌ఫ్యూజన్‌ పెంచేసిన నిర్మాత.. ఆందోళనలో ఫ్యాన్స్.. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మళ్లీ ఢీ?

Published : Feb 02, 2022, 09:02 PM IST
Bheemla Nayak: రిలీజ్‌పై కన్‌ఫ్యూజన్‌ పెంచేసిన నిర్మాత.. ఆందోళనలో ఫ్యాన్స్.. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో మళ్లీ ఢీ?

సారాంశం

 పవన్‌, రానా సినిమాని  ప్రివ్యూ చూశారని, ఔట్‌పుట్‌ విషయంలో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 25నే థియేటర్ లో సినిమా వస్తుందనే సంకేతాలు అందాయి. కానీ తాజాగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్‌పై మరింత కన్‌ఫ్యూజన్‌ పెంచారు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) నటిస్తున్న క్రేజీ మూవీ `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak). రానా మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ డైలాగులు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం మలయాళంలో రూపొందిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కి రీమేక్‌. సినిమా ఔట్‌పుట్‌పై సంగీత దర్శకుడు థమన్‌.సినిమా అద్భుతంగా ఉందన్నారు.

అయితే Bheemla Nayak జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie), `రాధేశ్యామ్‌` ల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు పాన్‌ ఇండియా సినిమాల కలెక్షన్లపై `భీమ్లా నాయక్‌` తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావించిన నిర్మాతలు చర్చలు జరపగా పవన్‌ వెనక్కి తగ్గాడు. ఫిబ్రవరి 25న థియేటర్‌లో రాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్‌ కారణంగా సినిమా రిలీజ్‌ డేట్లు మారిపోయాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` చిత్రాలు వాయిదా పడటంతో అన్ని సినిమాల రిలీజ్‌ డేట్లు మారిపోయాయి. కొత్త రిలీజ్‌ డేట్లు ప్రకటించుకున్నాయి.

అందులో భాగంగా.. `భీమ్లా నాయక్‌`పై కన్‌ఫ్యూజన్‌ పెంచారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న గానీ, లేదంటే ఏప్రిల్‌ 1న గానీ విడుదల చేస్తామని వెల్లడించారు. తాజాగా Pawan, రానా సినిమాని  ప్రివ్యూ చూశారని, ఔట్‌పుట్‌ విషయంలో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 25నే థియేటర్ లో సినిమా వస్తుందనే సంకేతాలు అందాయి. కానీ తాజాగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్‌పై మరింత కన్‌ఫ్యూజన్‌ పెంచారు. ఇప్పటికే రెండు డేట్లలో ఏ డేట్‌కి వస్తుందో అర్థం కాక అభిమానులు తికమక పడుతుంటే, తాజాగా నిర్మాత  కామెంట్లు మరింత కన్‌ఫ్యూజన్‌ పెంచేశాయి. 

ఏపీలో థియేటర్ల విషయంలో ప్రభుత్వం ఎప్పుడు వంద శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో, నైట్‌ కర్ఫ్యూని ఎత్తివేస్తుందో ఆ తర్వాతే సినిమాని విడుదల చేస్తామని బుధవారం మీడియాతో చెప్పారు. దీంతో ఇది మరింత కన్‌ఫ్యూజన్‌ పెంచినట్టయ్యింది. ఈ లెక్కన ఫిబ్రవరి 25న `భీమ్లా నాయక్‌` వచ్చే అవకాశం తక్కువ అని తెలుస్తుంది. ఇప్పట్లో కరోనా తగ్గుముఖం పట్టడం కష్టం. ఏపీలో కరోనా కేసులు చాలానే వస్తున్నాయి. దీంతో థియేటర్లకి రిలాక్సేషన్‌ దొరకడం కష్టం. పైగా సినిమా రంగంపై ఏపీ ప్రభుత్వం పట్టువిడుపులకు పోతుంది. టికెట్ల రేట్లు, షోలు, థియేటర్ల మెయింటనెన్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు సెట్‌ కావడం కష్టం. 

దీని కారణంగా ప్లాన్‌ బి అయిన ఏప్రిల్‌ 1నే `భీమ్లా నాయక్‌` అప్లై చేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు పవన్‌ అభిమానులు మరింతగా నిరాశ చెందుతున్నారు. ఫిబ్రవరిలో రాకపోవచ్చనే వార్తతో ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే `భీమ్లానాయక్‌ మరోసారి `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఢీ కొట్టబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మార్చి 25న `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంటే కేవలం ఆరు రోజుల గ్యాప్‌తోనే పవన్‌ రాబోతున్నాడు. అంతకు ముందు సంక్రాంతి టైమ్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` జనవరి 7న ప్రకటించగా, `భీమ్లా నాయక్‌` జనవరి 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండింటికి ఐదు రోజులే గ్యాప్‌ ఉంది.

 దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆ స్థాయి కలెక్షన్లు రావాలంటే కనీసం రెండు వారాలు ఎలాంటి పోటీ ఉండకూడదు. కానీ ఇప్పుడు కొత్త డేట్ల ప్రకారం వారం రోజుల కంటే ముందే `భీమ్లా నాయక్‌` విడుదలవుతుంది. ఇది `ఆర్‌ఆర్‌ఆర్‌` కలెక్షన్లపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఈ పోటీ ఇలానే కొనసాగుతుందా? లేక మళ్లీ రిలీజ్‌ డేట్లు మారుతాయా? అనే చర్చ కూడా మొదలైంది. తాజాగా `భీమ్లానాయక్‌` నిర్మాత రియాక్షన్‌ బట్టి ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని, ఇప్పుడు ప్రకటించిన రెండు రిలీజ్‌ డేట్లలో కూడా `భీమ్లా నాయక్‌` రావడం డౌటే అనే విషయాన్ని ఊతమిచ్చినట్టయ్యింది. మరి ఈ రిలీజ్‌ కన్ఫ్యూజన్‌కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. దీంతో ఇప్పుడు ఓ వైపు నిర్మాతలు, మరోవైపు ఆడియెన్స్ పూర్తి కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ