అరియనా నడుముపై అషురెడ్డి ముద్దు.. ఏంటి ఈ చండాలం అంటూ బూతులతో రెచ్చిపోతున్న నెటిజన్లు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 02, 2022, 08:15 PM IST
అరియనా నడుముపై అషురెడ్డి ముద్దు.. ఏంటి ఈ చండాలం అంటూ బూతులతో రెచ్చిపోతున్న నెటిజన్లు

సారాంశం

డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది అషు రెడ్డి. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది అషు రెడ్డి. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 4 తో పాపులర్ అయిన మరో బ్యూటీ అరియనా. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది. రాంగోపాల్ పుణ్యమా అని ఈ యంగ్ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆర్జీవితో కలసి జిమ్ లో చిట్ చాట్ చేస్తూ బోలెడు గుర్తింపు సొంతం చేసుకుంది అరియనా. 

తాజాగా అషురెడ్డి, అరియనా ఇద్దరూ ఇంటర్నెట్ లో మంటలు రేపెలా ట్రెండ్ సృష్టించారు. ఆర్జీవీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఇద్దరు భామలు బోల్డ్ గా మారిపోయారు. తాజాగా వీరిద్దరి రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. మీరు విన్నది నిజమే. అరియనా, అషురెడ్డి మధ్య ఇన్స్టాగ్రామ్ సాక్షిగా రొమాన్స్ జరిగింది. 

ఓ ప్రోగ్రాం కోసం అరియనా అందమైన అవుట్ ఫిట్ లో నడుము అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. అరియానాని చూడగానే అషురెడ్డి  ఆగలేకపోయిందేమో. వెంటనే ఆమె నడుముపై ముద్దు పెట్టింది. ఈ ఫోటోని అషురెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కాస్త ఇంటర్నెట్ లో వైల్డ్ ఫైర్ లా వ్యాపించేస్తోంది. 

అషు పోస్ట్ కి అరియనా స్పందిస్తూ.. ఒసేయ్ అషు నీకు నీ క్రేజీనెస్ కి ఓ దండం అంటూ కామెంట్ పెట్టింది. ఇక నెటిజన్లు అయితే వీరిద్దరిపై బూతులతో విరుచుకుపడుతున్నారు. ఏంటి ఈ చండాలం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. లెస్బియన్స్ అంటే వినడమే కానీ తొలిసారి చూస్తున్నాం అని మరో నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది కనుక ఆర్జీవీ చూస్తే ఇంకేమైనా ఉందా ఉందా అని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?