
స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ మధ్యన వరసపెట్టి రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాన్ జల్సా, ప్రభాస్ రెబెల్, మహేష్ పోకిరి, చిరంజీవి గ్యాంగ్ లీడర్, రీసెంట్ గా ఎన్టీఆర్ సింహాద్రి.. ఇలా ఒకరేమిటి స్టార్ హీరోల పాత సినిమాలన్నీ వరుస పెట్టి రీ రిలీజ్‌లవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా కొత్త సినిమాలు తరహాలో హంగామా చేస్తూ ..ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మరో చిత్రం రీరిలీజ్ కు రెడీ అయ్యింది. ఆ సినిమా మరేదో కాదు తొలి ప్రేమ.
ఈ చిత్రం అప్పటి యూత్ కు పిచ్చ పిచ్చగా నచ్చేయటమే కాకుండా పవన్ కళ్యాణ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌కు కనెక్ట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో దుమ్ము లేపి రికార్డ్ లు క్రియేట్ చేసింది. తెలుగులో వచ్చిన ఎపిక్ లవ్ స్టోరీస్‌లో ఇదొక సినిమాగా నిలిచింది. ఈ సినిమాను 4కె రెజల్యూషన్‌తో మళ్లీ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. ఈ సినిమాను జూన్ 30,2023న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటించారు.
తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్‌గానే ఆడినా.. గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు పవన్ స్థాయిని పెంచేసాయి. అలాంటి సమయంలో కొత్త దర్శకుడు ఏ కరుణాకరణ్ చెప్పిన కథ నచ్చి తొలి ప్రేమ సినిమా చేసాడు పవర్ స్టార్. తెలుగమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ హోదాను అందుకుంది.
ఇవివి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య, భీమినేని లాంటి పేరున్న దర్శకులతో తొలి మూడు సినిమాలు చేసిన తర్వాత తనకు తానుగా సొంతంగా నిర్ణయించుకుని.. కొత్త దర్శకుడితో పవన్ చేసిన సినిమా తొలి ప్రేమ. 1998లో అప్పటికే సుస్వాగతం లాంటి బ్లాక్‌బస్టర్ అందుకున్న పవన్.. అదే ఏడాది జూలై 24న విడుదలైన తొలిప్రేమతో వచ్చాడు. అది క్లాసికల్ హిట్‌గా నిలిచింది.
తొలి ప్రేమ సినిమా 1998లో రిలీజైంది. కరుణాకరణ్ దర్శకత్వం వహించారు. కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వాసుకి పవన్ చెల్లెలు పాత్రలో నటించింది. దేవా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. అలీ, వేణు మాధవ్, రవి బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.