
ప్రస్తుతం బాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు కార్తిక్ ఆర్యన్. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌కు కలెక్షన్ల కళ తెచ్చాడు కార్తీక్ ఆర్యన్. ఈ మధ్య కాలంలో నార్త్‌లో దక్షిణాది సినిమాల సందడి ఎక్కువైంది. సౌత్ హీరోల ముందు బాలీవుడ్ హీరోలు నిలబడలేకపోతున్నారు. ఈ క్రమంలో కార్తిక్ ఆర్యన్ మాత్రమే సౌత్ హీరోల పోటీని తట్టుకుని నిలబడ్డాడు. భుల్ భూలయా-2 సినిమాతో ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌కు ఊపిరి పోశాడు.
హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహించాడు. 2007లో బ్లాక్‌బస్టర్ హిట్టయిన భూల్ భూలయాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ లాంటి స్టార్స్ నటించిన భూల్ బులయా ఫస్ట్ పార్ట్ మూవీకి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ మధ్య బాలీవుడ్ లో సీక్వెల్స్, రీమేక్ ల ట్రెండ్ ఎక్కువ అవ్వడంతో.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం సాధించిన బూల్ బులాయాకు సీక్వల్ చేశారు టీమ్. ఈ ప్రయత్నంలో సక్కెస్ సాధించారు కూడా.
టీ సిరీస్ ఫిలంస్ బ్యానర్‌పై భూషన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా ఈ మూవీ మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో భూషన్‌కుమార్, కార్తిక్‌కు ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. మెక్‌లారెన్ జీటి కారును బహుమతిగా ఇచ్చాడు. దీని ధర దాదాపు 4.7 కోట్లు. ఇందులో మరో విశేషమేంటంటే ఇండియాలో డెలివరీ అయిన మొదటి జీటీ కారు కూడా ఇదే. చాలా కాలం తరువాత బాలీవుడ్ పరువు నిలబెట్టిన హీరోగా కార్తీక్ ఆర్యన్ పై ప్రశంసలు వర్షం కురుస్తోంది.
ఇక ప్రస్తుతం ఈ కారుతో పాటు ప్రొడ్యూసర్, హీరో కలసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన సోను కే టిటు కీ స్వీటీ, పతి పత్నీ ఔర్ వో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. భూషన్ కుమార్‌కు ఈ రెండు సినిమాల నుంచి కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. దాంతో కార్తీక్ ఆర్యన్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు నిర్మాతలు. వీళ్ళ బ్యానర్ లోనే రెగ్యూలర్ గా సినిమాలు చేసేట్టు ప్లాన్ చేస్తున్నారు.