బిగ్‌బాస్‌ బిగ్‌ ట్విస్ట్.. సభ్యులకు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ ?

Published : Nov 26, 2020, 07:56 PM IST
బిగ్‌బాస్‌ బిగ్‌ ట్విస్ట్.. సభ్యులకు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ ?

సారాంశం

ఈ వారం అవినాస్‌, అరియానా, అఖిల్‌, మోనాల్‌ నామినేట్‌ అయ్యారు. అందులో అవినాష్‌కి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలుచుకున్నాడు. దీని ప్రకారం రెండు వారాల్లో ఓ వారం తాను సేవ్‌ చేసుకునే అవకాశం ఉంది. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో బిగ్‌బాస్‌ ఇప్పటికే పలు ట్విస్ట్ లు ఇస్తూ వస్తున్నారు. మొదట్లో హారికని ఎలిమినేట్‌ అని చెప్పి మళ్ళీ నో చెప్పాడు.. ఆ తర్వాత అమ్మా రాజశేఖర్‌ విషయంలోనూ ఎలిమినేట్‌ అని చెప్పి, ఆ వారం ఎలిమినేషన్‌ లేదని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. రెండు వారాల క్రితం హౌజ్‌లోకి సుమ కంటెస్టెంట్‌గా రాబోతుందని చెప్పి బిగ్‌ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్. 

ఈ వారం అవినాస్‌, అరియానా, అఖిల్‌, మోనాల్‌ నామినేట్‌ అయ్యారు. అందులో అవినాష్‌కి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలుచుకున్నాడు. దీని ప్రకారం రెండు వారాల్లో ఓ వారం తాను సేవ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం అసలు ఎలిమినేషన్‌ ఉండదనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌ చేయకుండా, 13వ వారం, 14వ వారం ఎలిమినేట్‌ చేయాలని భావిస్తున్నారట. 

ఫైనల్‌కి ఐదుగురు వెళ్తారు. మిగిలిన ఇద్దరిని వచ్చే రెండు వారాల్లో పంపిస్తారని టాక్‌. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి మరో వార్త వినిపిస్తుంది. ఓ సభ్యుడిని తిరిగి హౌజ్‌లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. ఆ సభ్యుడిని తీసుకొస్తే, ఈ వారం ఎలిమినేషన్‌ ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే బుధవారం ఎపిసోడ్‌లో దెయ్యంతో బెదిరించిన బిగ్‌బాస్‌ సక్సెస్‌ కాలేకపోయాడు. దీంతో గురువారం ఎపిసోడ్‌లో అది మరింత పెంచబోతున్నాడట. అరియానా టార్గెట్‌గా భయపెట్టేందుకు ప్లాన్‌ చేసినట్టు తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తే అర్థమవుతుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?