ఒలంపిక్స్ లో పరుగులు తీయనున్న ప్రియాకంచోప్రా

Published : Oct 04, 2017, 04:38 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఒలంపిక్స్ లో పరుగులు తీయనున్న ప్రియాకంచోప్రా

సారాంశం

బాలీవుడ్ లో మరో బయోపిక్ పరుగుల రాణి పీటీ ఉషా జీవిత కథ ఆధారంగా సినిమా లీడ్ రోల్ లో ప్రియాంక చొప్రా నటించే అవకాశం

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ఎదిగి ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన నటి ప్రియాంక చోప్రా. ఇటు బాలీవుడ్ చిత్రాలతోనూ, హాలీవుడ్ లో టీవీ సిరీస్, సినిమాలతో   బిజీ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా.. త్వరలో ఒలంపిక్స్ లో పాల్గొననుంది. ప్ర్రియాంక చొప్రా.. ఒలంపిక్ గేమ్స్ లో పాల్గొనడం ఏమిటబ్బా అనుకుంటున్నారా?

 

పరుగులు రాణి పీటీ ఉషా గుర్తుండే ఉంటుంది. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పీటీ ఉషా పాత్రలో ప్రియాంక చోప్రా నటించనున్నట్లు సమాచారం. పీటీ ఉషా ఒలంపిక్స్ పరుగు పందెంలో పాల్గొని భారత్ కి స్వర్ణాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. మరి ఆమె బయోపిక్ ని తెరమీదకు ఎక్కించినప్పుడు.. ఆ ఒలంపిక్ గేమ్స్ కూడా ఉంటాయి కదా. అంటే.. ప్రియాంక చొప్రా.. పరుగులు తీయాల్సిందే కదా. కాకపోతే.. ఇంకా ప్రియాంక ఈ సినిమాలో నటించేందుకు తన అంగీకారం తెలుపలేదని సమాచారం.

 

ఈ సినిమాకి రేవతి ఎస్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. పీటీ ఉషా పాత్రలో ప్రియాంక అయితే.. చక్కగా సరిపోతుందని ఆమె భావించారట. వెంటనే ప్రియాంకను సంప్రదించారట. ప్రస్తుతం ప్రియాంక బిజీ బిజీ గా ఉండటంతో.. అంగీకారాన్ని త్వరలోనే  చెబుతానని చెప్పిందట. ఇప్పటికే ప్రియాంక.. బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా