కపిల్ భార్యగా కత్రినా

Published : Oct 04, 2017, 04:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కపిల్  భార్యగా కత్రినా

సారాంశం

కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ చిత్రం 83 కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ భార్య పాత్రలో కత్రినా కైఫ్

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. 1983వ సంవత్సరంలో తొలిసారిగా కపిల్ దేవ్ కెప్టెన్సీలో  భారత్ వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘83‘ పేరిట సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.

 

ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవలే ముంబయిలో ఆవిష్కరించారు. ఇక కపిల్ దేవ్ భార్య రోమి దేవి పాత్రలో కత్రినాకైఫ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కబీర్ దర్శకత్వంలో కత్రినా.. మూడు సినిమాల్లో నటించింది. తాజాగా ఈ సినిమాలోనూ కత్రినానే ఎంచుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్