ఒక్కసారిగా bigg boss5 హౌజ్‌ కన్నీటి పర్యంతం.. ప్రియాంకని అమ్మాయిగా అంగీకరించిన ఫాదర్‌

Published : Oct 07, 2021, 12:26 AM IST
ఒక్కసారిగా bigg boss5 హౌజ్‌ కన్నీటి పర్యంతం.. ప్రియాంకని అమ్మాయిగా అంగీకరించిన ఫాదర్‌

సారాంశం

బిగ్‌బాస్‌5 హౌజ్‌లోకి వచ్చేటప్పుడు కూడా ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున ముందు ఆమె ప్రస్తావించింది. బిగ్‌బాస్‌5 వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్‌ చేయించుకున్నట్టు, అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపింది ప్రియాంక సింగ్‌.  

`జబర్దస్త్` కమేడియన్‌ సాయితేజ ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం తెలిసిందే. సాయితేజ లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. అయితే తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం ఇంకా తన నాన్నకి తెలియదని, ఆయనకు తెలిస్తే రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే తట్టుకోలేకపోతున్నానని పలు సందర్భాల్లో ప్రియాంక సింగ్‌ తెలిపింది. బిగ్‌బాస్‌5 హౌజ్‌లోకి వచ్చేటప్పుడు కూడా ఇదే విషయాన్ని హోస్ట్ nagarjuna ముందు ఆమె ప్రస్తావించింది. బిగ్‌బాస్‌5 వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్‌ చేయించుకున్నట్టు, అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపింది. 

ఇంట్లో అన్నల పెళ్లిళ్లు అయిపోయాయని, వాళ్ల కుటుంబం ఏర్పడిందని, బాధ్యతలు పెరిగాయని, ఆ తర్వాత తనకు కూడా వాళ్ల నాన్న పెళ్లి చేస్తాడని, కానీ తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకంటూ ఓ కెరీర్‌, లైఫ్‌ ఉండాలని తాను లింగమార్పిడి చేయించుకున్నట్టు priyanka singh  తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఓ ప్రమాదంలో తన తండ్రి కళ్లు పోయాయని, ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని చూడలేడని, ఆ తర్వాతే తాను లింగమార్పిడి చేయించుకున్నట్టు తెలిపింది ప్రియాంక. 

ఒకానొక దశలో తండ్రి తనని తాకినప్పుడు ఏంటీ ఇలా మారిపోయావు, అమ్మాయిలా అనిపిస్తున్నావని అడిగారని, లేడీ పాత్రలు చేస్తుంటాను కదా అలా అనిపిస్తున్నానని తాను చెప్పడంతో నమ్మాడని,కానీ తాను ట్రాన్స్ జెండర్‌ చేయించుకున్న విషయం తెలియదని ప్రియాంక సింగ్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్‌ తండ్రి మాట్లాడారు. ఆమె ఆట తీరుపై ప్రశంసలు కురిపించిన ఆయన ఆమెని ట్రాన్స్ జెండర్‌గా ఒప్పుకుంటున్నానని తెలిపారు. 

related news:సన్నీ రాజు ముందు.. తేలిపోయిన రవి రాజు.. శ్రీరామ్‌ని లేపి కింద పడేసిన జెస్సీ.. సన్నీ ఆగ్రహం..

ఫస్ట్ ఆయన బాబూ సాయితేజ్‌ అంటూ పిలవడంతో ప్రియాంక సింగ్‌ కన్నీరు మున్నీరయ్యింది. మరోసారి తన గతం వెల్లడించడం, తాను పడ్డ బాధలను గుర్తు చేసుకోవడం, తండ్రి, కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ సమయంలో ప్రియాంక తనలోని బాధని తట్టుకోలేకపోయింది. బోరున విలపించింది. ఇది చూసిన ఇంటిసభ్యులు సైతం ఎమోషనల్‌ అయ్యారు. గుండె బరువెక్కిన వేళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంటి సభ్యులు మొత్తం భావోద్వేగానికి గురవడంతో bigg boss5 హౌజ్‌ కన్నీటి పర్యంతమైపోయిందని చెప్పొచ్చు. ఇది గురువారం ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?