సన్నీ రాజు ముందు.. తేలిపోయిన రవి రాజు.. శ్రీరామ్‌ని లేపి కింద పడేసిన జెస్సీ.. సన్నీ ఆగ్రహం..

Published : Oct 06, 2021, 11:52 PM ISTUpdated : Oct 07, 2021, 12:00 AM IST
సన్నీ రాజు ముందు.. తేలిపోయిన రవి రాజు.. శ్రీరామ్‌ని లేపి కింద పడేసిన జెస్సీ..  సన్నీ ఆగ్రహం..

సారాంశం

రాజ్యంలో ఉన్న ఒక్క సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు రవి, సన్నీ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమ బలాన్నీ, ఆర్థిక శక్తిని, ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. మడ్‌లో పోరాడే టాస్క్ లో సన్నీ టీమ్‌ నుంచి మానస్‌, రవి టీమ్‌ నుంచి విశ్వ పోరాడారు.

బిగ్‌బాస్‌5 షో అనేక విమర్శలతోపాటు కొన్ని విషయాల్లో ప్రశంసలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా ఇంటిసభ్యులు గేమ్‌ల విషయంలో పోరాడుతున్న తీరు అబ్బురపరుస్తుంది. ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతుంది. బుధవారం షోలో ఇంటి సభ్యులు మరోసారి తమ సత్తాని చాటారు. టాస్క్ లో ఎంతో సాహసోపేతంగా ఆడుతూ ఆకట్టుకుంటున్నారు. గెలిచేందుకు తపిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. 

రాజ్యంలో ఉన్న ఒక్క సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు ravi, sunny పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమ బలాన్నీ, ఆర్థిక శక్తిని, ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు. మడ్‌లో పోరాడే టాస్క్ లో సన్నీ టీమ్‌ నుంచి మానస్‌, రవి టీమ్‌ నుంచి విశ్వ పోరాడారు. ఇందులో విశ్వ విజయం సాధించాడు. మరో పెయిర్‌లో జెస్సీతో, ఆనీ మాస్టర్‌ పోరాడి ఓడిపోయింది. కానీ తన పోరాట పటిమని చాటుకుంది. దీంతో సన్నీ టీమ్‌ గెలిచింది. ఇందులో గేమ్‌ సమం అయిపోయింది. మరో పెయిర్‌ ఆసక్తి చూపలేదు. 

ఈ క్రమంలోనే రాజు పెట్టేలోని నాణేలను దొంగిలించే పని పెట్టుకున్నారు సిరి, షణ్ముఖ్‌, మానస్‌, జెస్సీ, కాజల్‌, ప్రియాంక. అయితే విశ్వ మాత్రం నాణేలను దొంగిలించే వారిపై ఫైర్‌ అయ్యారు. ఏదైనా ఉంటే ఇలా పోరాడి గెలవాలని, దొంగతనం చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు. ఇది కాసేపు ఇంటి సభ్యుల మధ్య వివాదానికి దారితీసింది. మరోవైపు రాజ్య ప్రజలు ఏ రాజు కి మద్దతు పలుకుతున్నారో తెలిపేలా ఉన్న రెండో పెద్ద బోర్డ్ ల్లో ఆ రాజు ఫోటోలను ఉంచాల్సి ఉంటుంది. దాన్ని ఇతర రాజు ప్రజలు అడ్డుకునే ఛాన్స్, వాటిని తొలగించే ఛాన్స్ ఉంది. 

అయితే ఇందులో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర మైన పోటీ నెలకొంది. చాలా మంది సన్నీ ఫోటోలను పెట్టారు. రవి ఫోటోలను సన్నీ టీమ్‌ సభ్యులు స్విమ్మింగ్‌ ఫూల్‌లో పడేశారు. సన్నీ ఫోటోలను తొలగించేందుకు శ్రీరామ్‌ చాలా ప్రయత్నం చేశాడు. దాన్ని జెస్సీ అడ్డుకున్నారు. ఈ ప్రాసెస్‌లో జెస్సీని శ్రీరామ్‌ కొట్టాడని ఆరోపించాడు సన్నీ. అయితే తాను అలా చేయలేదని, తనకు దెబ్బలు తగిలాయని చెప్పాడు శ్రీరామ్‌. ఈ వివాదం కాసేపు హౌజ్‌ని హీటెక్కించింది. 

also read: bigg boss5: ప్రియా ఎండు చేప.. సిరి సొరచేప.. రవిని రెచ్చగొట్టిన కాజల్‌.. మళ్లీ హీటెక్కిన హౌజ్‌

అనంతరం తాడు లాగి బలాన్ని ప్రదర్శించే టాస్క్ లో సైతం సన్నీ టీమ్ రెండు సార్లు విజయం సాధించింది. ప్రత్యర్థి టీమ్‌ రవికి సంబంధించిన సభ్యులు సన్నీ టీమ్‌తో పోటీ పడి ఓడిపోయారు. మొత్తంగా ఇంటి సభ్యుల మద్దతు కూడగట్టుకోవడంలో, నాణేలను సంపాదించడంలో, టాస్క్ ల్లోనూ సన్సీ టీమ్‌ విజయం సాధించింది. అయితే నాణేలను సంపాదించే క్రమంలో biggboss5 కెప్టెన్‌ శ్రీరామ్‌ రాత్రి సమయంలో మరో సభ్యుడు నిద్రపోయినప్పుడు అతని నాణేలను దొంగిలించి ప్రియురాలు హమీదకి ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. 

ఇంత వరకు బాగానే ఉన్నా ఈ టాస్క్ లు కొన్నిసార్లు హింసాత్మకంగా మారడం విమర్శలకు తావిస్తుంది. హింసకి తావులేకుండా తమ బలాన్ని ప్రదర్శించి గేమ్‌లు ఆడాల్సిన సమయంలో ఇంటి సభ్యులు  ఆవేశానికి గురవుతూ కొట్టుకునే స్థితికి చేరుకోవడం విమర్శలకు కారణమవుతుంది. ఈ రోజు ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడం గమనార్హం. మరోవైపు లోబో, షణ్ముఖ్‌లు గేమ్‌లకు అతీతంగా వ్యవహరించడం కూడా వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌