
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ పెళ్లి ఘడియ దగ్గరపడింది. రాజస్థాన్ జోద్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ఈ స్టార్ సెలబ్రెటీల కోసం స్వర్గం లోకంలా రెడీ అవుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి సంబందించినక్ అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.
డిసెంబర్ 2న నిక్ జోనస్ సంప్రదాయం ప్రకారం క్రిస్టియాన్ పద్దతిలో పెళ్లి జరగనుండగా ఆ మరుసటి రోజు హిందూ ఆచారాలతో ప్రియాంక కుటుంబ సభ్యులు ఘనంగా వివాహ వేడుకను జరపనున్నారు. ఈ పెళ్లి వేడుకల కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం జోధ్ ఉమైద్ భవన్ ప్యాలెస్ లో రూమ్స్ వరకు మూడున్నర కోట్ల వరకు ఖర్చువుతోందట.
5 రోజుల వరకు ప్యాలెస్ మొత్తాన్ని ఈ జంట బుక్ చేసుకుంది. వంటకాల్లో అతిధులకు ఇంటర్నేషనల్ రుచులను చూపించనున్నట్లు సమాచారం. ఒక్కో మనిషికి క్యాటరింగ్ పరంగా 18వేలు ఖర్చు చేయనున్నారు. కేవలం ఇన్విటేషన్స్ అందిన వారు మాత్రమే వేడుకల్లో పాల్గొననున్నారు. దాదాపు 10 కోట్ల వరకు పెళ్లి మొత్తానికి ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.