'అమర్ అక్బర్ అంటోనీ' కు 20 కోట్లు కలిసొచ్చాయి,ఫుల్ హ్యాపీ

By Prashanth MFirst Published Nov 28, 2018, 10:48 AM IST
Highlights

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అమర్ అక్బర్ అంటోనీ'. ఈ చిత్రం  మార్నింగ్ షోకే   డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.  మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసినా మరుసటి రోజు నుంచి పూర్తి డ్రాప్ కనపడటంతో థియోటర్ షేర్ కేవలం 6 కోట్లే వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. 

అయితే ఈ సినిమాని 24 కోట్లు పెట్టి నిర్మించారు. శ్రీను వైట్ల రెమ్యునేషన్ ప్రాఫెట్ షేర్ తీసుకుంటాననటంతో ఆయనకేమీ రూపాయి ముట్టలేదు. కేవలం నామమాత్రం రెమ్యునేషనే వర్కవుట్ అయ్యింది. నిర్మాతలు మొత్తం నష్టపోయామనుకున్న సమయంలో డిజిటిల్ రైట్స్ దేవుడులా వచ్చి ఆదుకున్నాయని చెప్తున్నారు.

ఈ చిత్రం తెలుగు,హిందీ శాటిలైట్ రైట్స్, అమిజాన్ ప్రైమ్ కు ఇచ్చిన డిజిటల్ రైట్స్ కలిపితే 20 కోట్లు వరకూ రికవరీ అయ్యిందిట.  దాంతో నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు రిలీఫ్ ఫీలయ్యారట. అవి కూడా సినిమా రిలీజ్ కు ముందు అనుకున్న ఎగ్రిమెంట్స్ అని, రిలీజ్ అయ్యి ప్లాఫ్ అయ్యాక అయితే ఆ మాత్రం కూడా రికవరీ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా నిర్మాతలకు పెద్ద భారం దిగినట్లే. 

ఇక ఈ చిత్రంతో  రవితేజ  మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.4 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన హారర్‌ కామెడీ 'టాక్సీవాలా' ముందు ఈ చిత్రం వెలవెలబోయింది. ఆ చిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన వసూళ్ల కంటే తక్కువ వసూళ్లు ఒక రోజు ముందుగా వచ్చిన 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'కి మొత్తానికి వచ్చాయి. ఈ హ్యాట్రిక్‌ డిజాస్టర్లతో మాస్‌ మహారాజా మార్కెట్‌కి దారుణమైన దెబ్బ తగిలింది.

click me!