సిద్ధార్థ్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే!

Published : May 06, 2019, 05:02 PM IST
సిద్ధార్థ్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే!

సారాంశం

గ్లోబల్ తార ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రాకి కొద్దిరోజుల క్రితం నిశ్చితార్ధం జరిగింది.

గ్లోబల్ తార ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రాకి కొద్దిరోజుల క్రితం నిశ్చితార్ధం జరిగింది. తను ప్రేమించిన అమ్మాయి ఇషితానే సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు వారి పెళ్లి క్యాన్సిల్ అయింది. 

మొదట ఇషితాకి జరిగిన సర్జరీ కారణంగా వీరి వివాహం వాయిదా పడిందనే వార్తలు వినిపించాయి. కానీ ఇషితా సోషల్ మీడియాలో తన పెళ్లి క్యాన్సిల్ అయిందనే అర్ధం వచ్చే విధంగా పోస్ట్ పెట్టింది. ఈ విషయంపై సిద్ధార్థ్ తల్లి మధు చోప్రా కూడా స్పందించిన పెళ్లి ఆగిపోయిన విషయాన్ని వెల్లడించింది.

అయితే ఎందుకు ఆగిందనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. తాజాగా ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని, కొంచెం సమయం కావాలని సిద్ధార్థ్ చెప్పడంతో పెళ్లి రద్దు చేయాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

ఏప్రిల్ 30న ఈ జంట వివాహం జరగాల్సివుంది. కానీ చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్