5 నిమిషాలకు 5కోట్లు.. ప్రియాంక చోప్రా రేంజ్

Published : Dec 16, 2017, 10:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
5 నిమిషాలకు 5కోట్లు.. ప్రియాంక చోప్రా రేంజ్

సారాంశం

బాలీవుడ్ హిరోయిన్లలో క్రేజీ హిరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్  లోనూ క్వాంటికో టీవీ సిరీస్ తో పాటు, బేవాచ్ తో క్రేజ్ తాజాగా నిమిషానికి కోటి రూపాయలు డిమాండ్ చేసిన  ప్రియాంక

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి క్రేజీ హీరోయిన్ గా మారిన నటి ప్రియాంక చోప్రా. అతి తక్కువ కాలంలో బాలీవుడ్ లో తనకుంటూ ప్రత్యేకతను చాటుకుంది. క్రేజీ హిరోయిన్ ప్రియాంక అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’తో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది.

 

ప్రియాంక డిసెంబరు 19న జరగనున్న జీ సినీ అవార్డుల వేడుకలో పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో ప్రియాంక వేదికపై ప్రదర్శన ఇవ్వనుందట. ఐదు నిమిషాల ఈ ప్రదర్శనకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్‌ చేసిందట. అంటే నిమిషానికి రూ.కోటి. ప్రస్తుతం ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రియాంక స్టేజ్ ప్రదర్శన ఇచ్చి దాదాపు రెండేళ్లయింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత వేదికపై డ్యాన్స్‌ చేస్తుండటం విశేషం. ఆమె 2016లో ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ అవార్డుల వేడుకలో ఓ పాటను డ్యాన్స్‌ చేశారు.

 

డిసెంబరు 19న నిర్వహించనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రియాంకతోపాటు షాహిద్‌ కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు వేదికపై తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రియాంక 2016లో ‘జై గంగాజల్‌’ తర్వాత హాలీవుడ్‌ సినిమా ‘బేవాచ్‌’, టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’తో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే నిర్మాతగా ‘వెంటిలేటర్‌’, ‘సర్వన్‌’ అనే మరాఠీ, పంజాబీ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఆమె నిర్మాణంలో మరో రెండు సినిమాలు రూపొందుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆమె రెండు హాలీవుడ్‌ సినిమాలు రానున్నట్లు  సమాచారం.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు