పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడంపై ప్రియమణి క్లారిటీ.. కారణం ఏంటంటే?

Published : Feb 16, 2024, 10:33 PM IST
పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడంపై ప్రియమణి క్లారిటీ.. కారణం ఏంటంటే?

సారాంశం

ప్రియమణి ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు అందుకుంది. ఇప్పుడు `భామ కలాపం 2` వెబ్‌ సిరీస్‌తో రాబోతుంది. కానీ టాలీవుడ్‌లో పెద్ద స్టార్స్ తో పనిచేయకపోవడంపై ఆసక్తికర సమాధానం చెప్పింది.

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది ప్రియమణి. అద్భుతమైన పాత్రలతో మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా నటిగా రాణిస్తుంది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా, ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో పాన్‌ ఇండియా నటిగా రాణిస్తుంది. ఇండియన్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె `భామ కలాపం2`తో రాబోతుంది. ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ఆకట్టుకుంటుంది. గతంలో వచ్చిన `భామ కలాపం` వెబ్‌ సిరీస్‌ వచ్చి మంచి ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ తీసుకొస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది ప్రియమణి. అందులో భాగంగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడంపై ఆమె రియాక్ట్ అయ్యింది. తమిళంలో, కన్నడ, మలయాళంలో పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. కానీ తెలుగులో ఎందుకు చేయలేదని యాంకర్‌ ప్రశ్నించగా ప్రియమణి స్పందించింది. 

తాను అందరితో పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపింది. పెద్ద హీరోలతోనూ సినిమాలు చేస్తానని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అయితే అలాంటి ఆఫర్లు తనకు రావడం లేదని పేర్కొంది. రాజమౌళి సర్‌తోనూ పనిచేయాలని ఉందని, గతంలో పనిచేశానని, మున్ముందు కూడా ఆయనతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. మంచి ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పింది ప్రియమణి. వాళ్లు పిలిస్తే కచ్చితంగా సినిమాలు చేస్తానని పేర్కొంది. అదే సమయంలో స్క్రిప్ట్ నచ్చాలని కూడా చెప్పడం కొసమెరుపు. నచ్చే సినిమాలు, పాత్రలే చేస్తానని ఆమె వెల్లడిచింది. 

ఇక ప్రియమణి గతంలో `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లో నటించింది. ఇప్పుడు సీజన్‌ 3లోనూ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆమె సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు `భామ కలాపం`2`తో రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. కిచెన్‌ ప్రధానంగా సాగే సిరీస్‌ ఇది. ఒక మధ్యతరగతి మహిళ కిచెన్‌లో వెరైటీస్‌ చేస్తూ పాపులర్‌ అవుతుంది. దీంతో యూట్యూబ్‌ చానెల్‌ పెట్టి ఫేమస్‌ అవుతుంది. దాని ద్వారా ఆమె హోటల్ కూడా స్థాపిస్తుంది. ఆమె వంటకాలు బెస్ట్ ప్రైజ్‌ కూడా వస్తుంది.ఈ క్రమంలో ఆమె ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటుంది. మరి దాన్నుంచి బయటపడేందుకు ఆమె ఏం చేసింది? ప్రియమణి ఇందులో ఒక్కరా? ఇద్దరా? ఆమెలోని మరో కోణం ఏంటనేది ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. గురువారం రాత్రి నుంచే ఇది `ఆహా`లో స్ట్రీమింగ్‌ అవుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు