కమెడియన్ ప్రియదర్శి బైక్ దొంగతనం!

Published : Jul 09, 2019, 09:40 AM IST
కమెడియన్ ప్రియదర్శి బైక్ దొంగతనం!

సారాంశం

'పెళ్లిచూపులు' చిత్రంతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. 

'పెళ్లిచూపులు' చిత్రంతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో అతడికి అవకాశాలు బాగా పెరిగాయి. ఇటీవల హీరోగా 'మల్లేశం' అనే సినిమా కూడా చేశాడు.

ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ప్రియదర్శి ఎంతో ఇష్టపడి ఓ బైక్ కొనుక్కున్నాడు. రాత్రి దాన్ని ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే కొద్దిసేపటికే దాన్ని దొంగతనం చేశారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో కామెడీ యాంగిల్ లో చెప్పాడు ప్రియదర్శి. ''నా బైక్ ని దొంగిలిస్తున్న వీడియో ఫుటేజ్ ఇది.. కనీసం ఈ దొంగ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో.. లేదో కూడా చెక్ చేసుకోలేదు.. 'అన్ ప్రొఫెషనల్ థీఫ్''' అంటూ పోస్ట్ చేశాడు. అయితే కొద్దిసేపటికే వీడియోని తన అకౌంట్ నుండి డిలీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం