ప్రియా ప్రకాష్.. టాటూ సీక్రెట్ ఇదే..!

By Udayavani DhuliFirst Published 24, Jan 2019, 12:56 PM IST
Highlights

ఒక్క వీడియోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

ఒక్క వీడియోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో ఫిబ్రవరి 14న తెలుగులో విడుదల చేస్తున్నారు.

నిన్న జరిగిన సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో ప్రియా ప్రకాష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టు, బొట్టు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంలో ఆమె ఎదపై ఉన్న టాటూ హాట్ టాపిక్ గా మారింది.

టాటూ ఆసక్తికరంగా కనిపించడంతో కెమెరా ఫ్లాష్ లు ఆ టాటూపైనే మెరిశాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆ టాటూ అర్ధం ఏంటో  తెలుసుకోవాలని గూగుల్ చేయడం మొదలుపెట్టారు.

'Carpe Diem'ప్రియా ఎదపై ఉన్న టాటూ ఇదే.. ఇది లాటిన్ భాషకి చెందిన పదం. దీనికి అర్ధమేంటంటే.. 'ఫ్యూచర్ మీద చిన్న ఆశ, నమ్మకంతో నేడు జీవించండి'.దీన్నే టాటూగా వేయించుకుంది ఈ బ్యూటీ. 
 

గాజు కళ్లతో మత్తెక్కిస్తోన్న ప్రియా వారియర్!

Last Updated 24, Jan 2019, 12:56 PM IST