టెంపర్ రీమేక్ లో చాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్

Published : Mar 12, 2018, 01:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
టెంపర్ రీమేక్ లో చాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్

సారాంశం

ఒక్క వీడియో తో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రియా వారియర్ టెంపర్ హిందీ రీమేక్ లో చేైస్తుందంట కరణ్ జోహార్ తాను రణవీర్ సింగ్ తో చేయబోయే'టెంపర్' రీమేక్ లో ప్రియా వారియర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట

ఎన్టీఆర్ చేసిన టెంపర్ ఆయన కెరీర్ గ్రాఫ్ నే మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ సీజన్, వరల్డ్ కప్ ఫీవర్ లో 48 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఎన్టీఆర్ రేంజ్ తగ్గ కలెక్షన్లు కాకపోవచ్చు కానీ సీజన్ ప్రకారం చూసుకున్న ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా చూసుకున్న దుమ్ముదులిపాడు. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబందించి ఇంకొక అప్ డేట్ ఒకటి వస్తుంది. ఒక్క వీడియో తో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రియా వారియర్ టెంపర్ హిందీ రీమేక్ లో చేైస్తుందంట. ఆమెతో సినిమాలు చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పాటు హిందీ పరిశ్రమకు చెందిన పలువురు ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తాను రణవీర్ సింగ్ తో చేయబోయే'టెంపర్' రీమేక్ లో ప్రియా వారియర్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
 
ఈ చిత్రంలో రణవీర్ సింగ్ తెలుగులో ఎన్టీఆర్ పోషించిన పోలీస్ పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకుడు. ఇటీవల మీడియాతో ప్రియా వారియర్ మాట్లాడుతూ... తాను బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు పెద్ద అభిమానిని అని, అతడితో కలిసి పని చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి