Allu arjun: అల్లు అర్జున్ ని అన్నారని, మనోళ్లు యష్ ని ఆడుకున్నారా?

Surya Prakash   | Asianet News
Published : Apr 12, 2022, 01:34 PM IST
Allu arjun: అల్లు అర్జున్ ని అన్నారని, మనోళ్లు యష్ ని ఆడుకున్నారా?

సారాంశం

 ఆల‌స్యం అవ్వ‌డానికి అది కూడా ఒక కారణం. కావాలని లేట్ చేయలేదు. ప‌ది నిముషాలు కూడా విలువైనవే. మీ స‌మ‌యాన్ని వృధా చేసినందుకు న‌న్ను క్షమించండి అంటూ య‌శ్ పేర్కొన్నాడు.


 `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న క‌న్న‌డ రాక్‌స్టార్‌ య‌ష్... మరికొద్ది గంటల్లో  `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని హొంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై విజయ్‌ కిరగందుర్ నిర్మించారు.  గ‌త ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. మ‌రో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 14న అట్ట‌హాసంగా విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో  హీరో య‌శ్ కూడా చిత్ర టీమ్‌తో క‌లిసి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆయ‌న తెలుగు మీడియాకు బ‌హిరంగంగానే క్ష‌మాప‌ణ‌లు తెలిపాడు. అస‌లేం జ‌రిగిందంటే..హీరో యష్ ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అక్క‌డ నుండీ వైజాగ్ మీడియా సమావేశానికి బయల్దేరారు. అయితే వైజాగ్ ప్రెస్ మీట్ కి యశ్‌ దాదాపు గంటన్నర లేట్‌గా వెళ్లాడు. దాంతో మీడియా ఆయ‌న‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.అంతేకాదు, తమని గంటల పాటు ఎదురుచూసేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప‌లువురు రిపోర్టర్‌లు ప్ర‌శ్నించారు.

 అందుకు య‌శ్‌.. గత కొన్ని రోజుల నుంచీ నేను ఎక్కడకి వెళుతున్నానో, వస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. చిత్ర టీమ్ ఎక్కడికి తీసుకెళ్తే ఆ కార్యక్రమానికి హాజ‌రు అవుతున్నా. ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాం. ఆల‌స్యం అవ్వ‌డానికి అది కూడా ఒక కారణం. కావాలని లేట్ చేయలేదు. ప‌ది నిముషాలు కూడా విలువైనవే. మీ స‌మ‌యాన్ని వృధా చేసినందుకు న‌న్ను క్షమించండి అంటూ య‌శ్ పేర్కొన్నాడు.

 కాగా, ఇలాంటి సంఘ‌ట‌నే గ‌తంలో అల్లు అర్జున్‌కు బెంగుళూరులో జ‌రిగింది. అప్పుడు ఆయ‌న కూడా సారీ చెప్పి మీడియాను కూల్ చేశారు. అయితే ఇదంతా బన్నిని గతంలో బెంగుళూరులో ఇబ్బంది పెట్టినందుకే ఇలా వాళ్ల కన్నడ హీరోని కూడా ఇలా ఇక్కడ మన తెలుగు మీడియావారు ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప ది రైజ్` మూవీ ప్రచారం లో భాగంగా కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లారు. అక్కడ కన్నడలో రిలీజ్ అవుతున్న `పుష్ప` కోసం అక్కడి మీడియా తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అయితే అక్కడి మీడియా బన్నీకి ఊహించని షాకిచ్చింది. ఈ సినిమా ప్రెస్ సమావేశం కోసం ఏకంగా రెండు గంటల పాటు వెయిట్ చేయించారని మా టైమ్ ని వేస్ట్ చేశారంటూ అక్కడి మీడియా బన్నీపై విరుచుకుపడింది. దీంతో వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేసిన బన్నీ తనకు ప్రోగ్రామ్ ఈ టైమ్ కే చెప్పారని ప్రత్యేక పరిస్థితులు వున్న కారణంగా ప్రత్యేక చాపర్ లలో రావాల్సి వచ్చిందని ఆ కారణంగానే తనకు ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసుకి బాధ కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
 
దీంతో కన్నడ మీడియా శాంతించి బన్నీకి పూర్తిగా సహకరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో బన్నీకి కన్నడ మీడియాకు మధ్య జరిగిన సంభాషణ అంతా లీక్ అయిపోయి పెద్ద చర్చకు దారితీసింది. ఆ తరువాత సినిమా విడుదలైంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌