మ‌రో హిట్ పై క‌న్నేసిన నాగ‌చైత‌న్య‌

Published : Apr 09, 2017, 04:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మ‌రో హిట్ పై క‌న్నేసిన నాగ‌చైత‌న్య‌

సారాంశం

మ‌రో హిట్ పై క‌న్నేసిన నాగ‌చైత‌న్య‌ క‌థ సిద్ధం చేస్తోన్న చందు మొండేటి ప్రేమ‌మ్ కంటే పెద్ద హిట్ అంటున్న అక్కినేని అభిమానులు

లాస్ట్ ఇయర్ ప్రేమం సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమా కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ రెండు సినిమాల తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేస్తున్న చైతన్య మరోసారి ప్రేమం డైరక్టర్ చందు మొండేటి డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడట.

అక్కినేని ఫ్యామిలీ నుండి నాగ చైతన్య కూడా స్టార్ హీరోగా మారేందుకు చేసే ప్రయత్నాల్లో ఈ కథ కచ్చితంగా ఉపయోగపడుతుందని.. దర్శకుదు చందు మొండేటి కూడా ఈ సినిమా తర్వాత స్టార్ డైరక్టర్ అవుతాడని అంటున్నారు. 

కథ ఇంతవరకు తెలుగు తెర మీద చూడనిదిగా ఉంటుందట. అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా ఊహకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు. అంచనాలైతే బాగానే ఉన్నాయి చందు మీద ఉన్న నమ్మకంతో కచ్చితంగా అంచనాలను అందుకునే సినిమా ఈ ఇద్దరు చేస్తారని అనిపిస్తుంది. 
ఇక ఈ సినిమా కథ తెలిసిన వారు కచ్చితంగా నాగ చైతన్య రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా