నాగచైతన్యతో ప్రవీణ్ సత్తారు ప్లానింగ్!

Published : Feb 06, 2019, 10:12 AM IST
నాగచైతన్యతో ప్రవీణ్ సత్తారు ప్లానింగ్!

సారాంశం

'చందమామ కథలు' చిత్రంతో అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఆ తరువాత 'గుంటూరు టాకీస్' అనే మరో హిట్టు సినిమా తీశాడు. 

'చందమామ కథలు' చిత్రంతో అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఆ తరువాత 'గుంటూరు టాకీస్' అనే మరో హిట్టు సినిమా తీశాడు. 'గరుడ వేగ' చిత్రంతో ఎలాంటి కథనైనా.. హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం 'శివగామి' వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ గా ఉండదన్ ఖాయం. ప్రస్తుతం కథకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి.

అవి కొలిక్కి వస్తే వీరి కాంబినేషన్ లో సినిమా ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య 'మజిలీ' చిత్రంలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

ఈ సినిమా పూర్తయిన తరువాత చైతు 'వెంకీ మామ' సినిమా షూటింగ్ లో పాల్గొనున్నాడు. ఆ తరువాతే ప్రవీణ్ సత్తారు సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే