కేజీఎఫ్ పై వెంకటేష్ మహా వివాదం..నేను ప్రవచనాలు చెప్పను, క్రిస్టల్ క్లియర్ గా ప్రశాంత్ నీల్ కామెంట్స్

Published : Mar 08, 2023, 01:37 PM IST
కేజీఎఫ్ పై వెంకటేష్ మహా వివాదం..నేను ప్రవచనాలు చెప్పను, క్రిస్టల్ క్లియర్ గా  ప్రశాంత్ నీల్ కామెంట్స్

సారాంశం

కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా ఇటీవల ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అతడిపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది.

కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా ఇటీవల ఇంటర్వ్యూలో కేజీఎఫ్ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అతడిపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కంచరపాలెం చిత్రంతో వెంకటేష్ మహా సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. తాజాగా వెంకటేష్ మహా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, శివ నిర్వాణ, నందిని రెడ్డి లాంటి దర్శకులు ప్రముఖ జర్నలిస్ట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

వెంకటేష్ మహా కమర్షియల్ చిత్రాల గురించి మాట్లాడాడు. ఉదాహరణగా కేజీఎఫ్ చిత్ర కథని, హీరో యష్ పాత్రని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ఏకంగా యష్ పాత్రని నీచ్ కమీన్ కుత్తే అంటూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ తల్లి పాత్రని తెరకెక్కించిన విధానం పై వెంకటేష్ మహా వెటకారంగా మాట్లాడడం, రాఖీ భాయ్ పాత్ర ముగింపుపై విమర్శలు చేయడం అభిమానులకు నచ్చడం లేదు. 

దీనితో వెంకటేష్ మహా దిగి వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ట్రోలింగ్ జరిగింది. అయితే వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలపై కేజీఎఫ్ అభిమానులు ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. వెంకటేష్ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలోనే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 

వెంకటేష్ మహా అడిగిన ప్రశ్నలు గతంలో ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కి ఎదురయ్యాయి. అప్పుడే ప్రశాంత్ నీల్ క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. ఒక తల్లి తన కొడుకుకి ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం పోగు చేయమని చెప్పడం వెనుక ఆమె అనుభవించిన పేదరికమే కారణం. అందుకే తన కొడుకుకి.. నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు.. కానీ చనిపోయేటప్పుడు మాత్రం పెద్ద ధనవంతుడిగా చనిపోవాలి అని అంటుంది. 

రాఖీ ఏమీ లేకుండా చనిపోతే అతడి తల్లి చెప్పిన మాటలకు అర్థం లేదు అని ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ అప్పుడే చెప్పాడు. అది బాధ్యతా రాహిత్యమైన స్టేట్మెంటే.. కాదనడం లేదు.. కానీ నేను క్యారెక్టర్ గురించి మాత్రమే చెబుతాను. ప్రవచనాలు చెప్పను అంటూ కంప్లీట్ క్లారిటీ ఇచ్చాడు. అతడి తల్లి ఉద్దేశం తనలాగా తన కొడుకు నిరుపేదగా మరణించకూడదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా కమర్షియల్ చిత్రాల్లో వందశాతం లాజిక్కులు వర్కౌట్ కావు. వెంకటేష్ మహా కెజిఎఫ్ చిత్రాన్ని విమర్శించాలని భావిస్తే దానికి ఒక పద్ధతి ఉంది. కానీ వెటకారం జోడిస్తూ కించపరిచే విధంగా మాట్లాడడంతో తీవ్రస్థాయిలో విమర్శల పాలయ్యాడు.    

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు