ప్రభాస్ తప్పుకోగానే, రామ్ చరణ్ తో చర్చలు మొదలు?

Published : Aug 25, 2020, 08:40 AM IST
ప్రభాస్ తప్పుకోగానే, రామ్ చరణ్ తో చర్చలు మొదలు?

సారాంశం

ప్రభాస్ తో సినిమా అనుకుని కథ రెడీ చేసుకున్నవాళ్లు వేరే హీరో కోసం ఆల్టర్నేటివ్ లు వెతుకుతున్నారు. అలా రామ్ చరణ్ తో ఓ ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు మొదలెట్టారని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరంటే...

ఒక కథ ఒకరి కోసం అనుకోవటం..తర్వాత రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకపోతే వేరే హీరో సీన్ లోకి రావటం సిని పరిశ్రమలో సర్వ సాధారణం. ఇప్పుడు ప్రభాస్ వరస సినిమాలతో బిజిగా ఉన్నారు. దాంతో ప్రభాస్ తో సినిమా అనుకుని కథ రెడీ చేసుకున్నవాళ్లు వేరే హీరో కోసం ఆల్టర్నేటివ్ లు వెతుకుతున్నారు. అలా రామ్ చరణ్ తో ఓ ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు మొదలెట్టారని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరంటే...

ప్రభాస్ హీరోగా ఉగ్రం రీమేక్ చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ కలం నిజం కాలేదు. ఈ లోగా ప్రభాస్..ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగటం తో ఉగ్రం రీమేక్ అనేది చిన్నదిగా కనపడింది. అయితే ఉగ్రంపై చాలా నమ్మకాలు ఉన్నాయి దర్శకుడు ప్రశాంత్ నీల్ కు. తన మొదటి చిత్రం ఉగ్రం కు ఇప్పటికాలానికి తగినట్లు కొన్ని మార్పులు చేసిన ఆయన ప్రభాస్ తో ముందుకు వెళ్ధామని ప్రయత్నం చేసారు. 

కేజీఎఫ్ హిట్ అయ్యాక ప్రభాస్ సైతం ఉత్సాహం చూపించారు. అయితే బాలీవుడ్ ప్రాజెక్టు కమిటవ్వటంతో అది వెనక్కి వెళ్లింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం వెనకడుగు వెయ్యదలుచుకోలేదు. వెంటనే రామ్ చరణ్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కన్నడ సినీ వర్గాల సమాచారం. ఈ మేరకు రామ్ చరణ్ తో టచ్ లోకి వెళ్ళాడని చెప్పుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, కాకపోతే కేజీఎఫ్ దర్శకుడుతో సినిమా అనేది చాలా ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుగా ఫీల్ అయ్యాడని చెప్తున్నారు. మరి ఉగ్రం రీమేక్ ..రామ్ చరణ్ చేస్తాడా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?