మాస్క్ విషయంలో హీరోయిన్‌తో గొడవ.. ఇద్దరు యువకుల అరెస్ట్

Published : Aug 25, 2020, 08:32 AM IST
మాస్క్ విషయంలో హీరోయిన్‌తో గొడవ.. ఇద్దరు యువకుల అరెస్ట్

సారాంశం

మరాఠి నటి మానసి నాయక్‌ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది.అయితే అక్కడ ఇద్దరు కుర్రాళ్లు, మాస్క్‌ లేకుండా, ఫిజికల్ డిస్టాన్స్‌ పాటించకుండా ప్రవర్తిస్తుండటంతో ఆమె వారికి మాస్క్‌ ధరించాల్సిందిగా సూచించింది.

కరోనా కాలంలో మాస్క్ విషయంలో జరిగే గొడవలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారితో జరిగిన గొడవలు రక్తపాతాలకు కూడా కారణమైన వార్తలు విన్నాం. అలాంటి అనుభవమే ఓ హీరోయిన్‌కు కూడా ఎదురైంది. మరాఠి నటి మానసి నాయక్‌ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది.

అయితే అక్కడ ఇద్దరు కుర్రాళ్లు, మాస్క్‌ లేకుండా, ఫిజికల్ డిస్టాన్స్‌ పాటించకుండా ప్రవర్తిస్తుండటంతో ఆమె వారికి మాస్క్‌ ధరించాల్సిందిగా సూచించింది. అయితే ఆ యువకులు అందుకు నిరాకరించటంతో పాటు ఆమెతో గొడవకు దిగారు. వివాదం శృతిమించటంతో వారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో మనస్థాపానికి గురైన మానసీ, వారి మీద పోలీస్‌ కంప్లయింట్ ఇచ్చింది.

వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు మెహ్‌రజ్‌ నిశ్శార్‌ అజ్మి, సూర్య రమేశ్‌ దూబెలు అని పోలీసులు తెలిపారు. వారికి నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో రిచ్ స్టార్స్ లో ఇద్దరు తెలుగు హీరోలు, టాప్ 10 లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
OTT: పెళ్లి అయిన మ‌హిళ‌లే టార్గెట్‌, శారీర‌కంగా వాడుకుని ఆపై.. ఓటీటీలో షాకింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌