అనుమతిచ్చినా షూటింగ్‌లు చేయలేం.. నిర్మాత సీ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Published : Aug 25, 2020, 08:12 AM IST
అనుమతిచ్చినా షూటింగ్‌లు చేయలేం.. నిర్మాత సీ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఇటీవల షరతులతో సినిమా షూటింగ్‌లకు కూడా అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది తిరిగి షూటింగ్‌లు ప్రారంభించేందుకు రెడీ అవుతుండగా, మరికొందరు మాత్రం కేంద్ర అనుమతి ఇచ్చినా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కరోనా కారణంగా నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు స్థంబించిపోయాయి. సినిమా షూటింగ్ అంటేనే వందల మందితో వ్యవహారం, కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో అంత మందితో షూటింగ్‌లు చేయటం సరికాదని ప్రభుత్వాలు కూడా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వలేదు. అయితే తాజాగా అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని షరతులతో సినిమా షూటింగ్‌లకు కూడా అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది తిరిగి షూటింగ్‌లు ప్రారంభించేందుకు రెడీ అవుతుండగా, మరికొందరు మాత్రం కేంద్ర అనుమతి ఇచ్చినా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత సీ కళ్యాణ్‌ అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం కరోనా సోకినవారిలో రికవరీ రేటు భారీగానే ఉన్న, కొంత మంది భయానక పరిస్థితుల్లో మరణించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లకు హాజరయ్యేందకు స్టార్స్‌ సుముఖంగా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది, వ్యాక్సిన్‌ వస్తే గానీ ధైర్యంగా షూటింగ్‌లకు హాజరయ్యే పరిస్థితి లేదని, అందుకే పూర్తి స్థాయిలో సినిమాకు సంబంధించిన షూటింగ్‌లు ఇతర కార్యక్రమాలు ప్రారంభ కావడానికి మరింత సమయం పడుతుందని సీ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?