'హను-మాన్' డైరెక్టర్ నెక్స్ట్ 'ఆక్టోపస్ ', స్టోరీ లైన్ ఏంటంటే...

Published : Mar 19, 2024, 02:24 PM IST
 'హను-మాన్' డైరెక్టర్ నెక్స్ట్  'ఆక్టోపస్ ',  స్టోరీ లైన్ ఏంటంటే...

సారాంశం

 ఇప్పటికే 65 శాతం పూర్తి చేసిన ఆక్టోపస్ సినిమా షూటింగ్​ను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 


రీసెంట్ గా  'హను-మాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రశాంత్ వర్మ. దాంతో  ఈ దర్శకుడు  నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరిలో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఆ వెంటనే  'హనుమాన్'  కి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పిన దర్శకుడు.. త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.  ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంటే  ముందు ప్రశాంత్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు  వినిపిస్తున్నాయి. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జై హనుమాన్ షూటింగ్​ కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తన పాత పెండింగ్ ఉన్న చిత్రంపై ఫోకస్ పెట్టారట ప్రశాంత్. ఇప్పటికే 65 శాతం పూర్తి చేసిన ఆక్టోపస్ సినిమా షూటింగ్​ను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆక్టోపస్ సినిమా   పూర్తిగా మహిళా ప్రాధాన్యత చిత్రం అని తెలుస్తోంది. ఇందులో ఐదు మహిళా ప్రధాన పాత్రలు ఉంటాయని  తెలిపారు ప్రశాంత్ వర్మ. ఇందులో ఒక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. 

ఈ చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఐదుగురు మహిళలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయినప్పుడు ఏమి జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అయితే ఈ సినిమాను మొదటగా ఫిల్మ్ ఫెస్టివల్స్​కు పంపించిన తర్వాత థియేటర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు తర్వాత మొదలెట్టే 'జై హనుమాన్' సినిమా కథంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో  హనుమాన్ రోల్ లో ఏ హీరో నటిస్తారనే దాని గురించి  మీడియాలో  చర్చలు జరుగుతున్నాయి.  రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు ప్రశాంత్ వర్మ.. ఈ గ్యాప్ లో అసంపూర్తిగా మిగిలిపోయిన 'ఆక్టోపస్' అనే సినిమాని కంప్లీట్ చేస్తున్నారు. ఇంతకు ముందు  65 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే సినిమా అంతా పూర్తవుతుందని చెప్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో