ఆ ఇద్దరు దర్శకులకు నిర్మాత సెట్ కి రాకూడదు!

Published : Aug 31, 2019, 02:15 PM IST
ఆ ఇద్దరు దర్శకులకు నిర్మాత సెట్ కి రాకూడదు!

సారాంశం

దక్షిణాదిలోని ఇద్దరు ప్రముఖ దర్శకులు ఉన్నారని.. వారికి నిర్మాతలు సెట్ కి రాకూడదనేది షరతు అని చెప్పారు పీవీపీ. ఆ దర్శకుల పేర్లు మాత్రం చెప్పలేదు. 

ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ పీవీపీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి వెల్లడించారు. దక్షిణాదిలోని ఇద్దరు ప్రముఖ దర్శకులు ఉన్నారని.. వారికి నిర్మాతలు సెట్ కి రాకూడదనేది షరతు అని చెప్పారు.

ఆ దర్శకుల పేర్లు మాత్రం చెప్పలేదు. వారు మన పక్క రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పారు. దర్శకులకు డిమాండ్ ఉంది.. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ లు వారి వల్లే సాధ్యమవుతాయి..  వారిని విమర్శించలేమని.. నిర్మాతలకు మరో దారి లేదని అన్నారు. 

ఆ తరువాత 'బ్రహ్మోత్సవం' సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో పంపిణీదారులకు తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చాం. ఈ సినిమా వైఫల్యానికి హీరో మహేష్ బాబుని విమర్శించలేమని' అన్నారు.

మహేష్ దర్శకుల హీరో అని.. అవసరమైతే ఒక సీన్ ను పది సార్లు చేస్తుంటారని.. ఓ సినిమా ఎప్పుడూ దర్శకులపై ఆధారపడి ఉంటుందని.. దర్శకుడు అందరితో కలిసి పనిచేస్తే  అవుట్ పుట్ ఇంకా బాగా వస్తుందని అన్నారు. నిర్మాతలు కోట్లు పెడుతుంటే.. కొందరు దర్శకులు స్క్రిప్ట్ పూర్తి కాకుండానే సెట్స్ పైకి వెళ్తుంటారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్