ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో సీక్రెట్ గా.. నాగార్జునకు తెలియకుండానే ?

pratap reddy   | Asianet News
Published : Aug 28, 2021, 06:07 PM IST
ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో సీక్రెట్ గా.. నాగార్జునకు తెలియకుండానే ?

సారాంశం

టాలీవుడ్ లో 'మా' ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు హీరో విష్ణు మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది.

టాలీవుడ్ లో 'మా' ఎన్నికల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు హీరో విష్ణు మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. అక్టోబర్ 10న మా ఎన్నిక నిర్వహించేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు నటి హేమ, జీవిత రాజశేఖర్, నటుడు నరసింహారావు లాంటి ప్రముఖులు అధ్యక్ష బరిలో నిలిచారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికలో విజయం సాధించేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. 

ప్రకాష్ రాజ్ ఇప్పటికే సినిమా బిడ్డలు పేరుతో ప్యానల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మా ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రకాష్ రాజ్ ఎవరూ ఊహించని ప్లాన్స్ తో ముందుకు వెళుతున్నారు. 

ఆగష్టు 29న కింగ్ నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. కింగ్ బర్త్ డేని మా ఎన్నికల క్యాంపైన్ గా ఉపయోగించుకోవాలని ప్రకాష్ రాజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. దీనికోసం ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో సీక్రెట్ గా సెలబ్రేషన్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రకాష్ రాజ్ ప్యానల్ లో సభ్యుడుగా ఉన్న నటుడు సమీర్  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇన్విటేషన్స్ పంపారట. ఈ తతంగం మొత్తం నాగార్జునకు తెలియకుండానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఓటర్ల సమీకరణ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం