ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన!

Published : Jan 01, 2019, 09:58 AM IST
ప్రకాష్ రాజ్ సంచలన ప్రకటన!

సారాంశం

కొత్త సంవత్సరం సందర్భంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఏడాది జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

కొత్త సంవత్సరం సందర్భంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సంచలన ప్రకటన చేశాడు. ఈ ఏడాది జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఏ నియోజక వర్గం నుండి పోటీ చేయనున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ''అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సపోర్ట్ తో నేను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. ప్రజల గొంతుని పార్లమెంట్ లో వినిపిస్తాను'' అంటూ పోస్ట్ పెట్టాడు.

రజినీకాంత్, కమల్ హాసన్ తరువాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన వారిలో ప్రకాష్ రాజ్ మూడో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన రాజకీయ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది