
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏడాది పూర్తి చేసుకున్నాడు మంచు విష్ణు. ఈ విషయంలో విలక్షణ నటుడు, మా ప్రెసిడెంట్ పోటీదారు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆయన ఎన్నికై ఏడాది మాత్రమే అయ్యిందని. ఆయన పని చేస్తున్నారా.. లేక చేయడం లేదా అనేది అందరికి తెలస్తుందన్నారు. ముఖ్యంగా మా సభ్యులు దగ్గర నుంచి గమనిస్తుంటారు కాబట్టి..ఈ విషయంలో పని చేయించుకనే బాధ్య మా సభ్యులపై కూడా ఉంటుందన్నారు.
అంతే కాదు రీసెంట్ గా మంచు విష్ణు మాట్లాడుతూ.. 90 శాతం మేం చెప్పిన పనులు కంప్లీట్ చేశాం అంటూ.. విష్ణు ప్రకటించడం గురించి ప్రకాశ్ రాజ్ స్పందన అడగ్గా.. మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయ్యిందని. ఇంకా ఏడాది ఉంది కాబట్టి.. ఏం చేస్తారో చూడాలి అన్నారు. 90 శాతం పని చేశాం అని చెప్పుకుంటే చాలదు.. చేసించి చూపించాలి అన్నారు ప్రాకాశ్ రాజ్. చేశాం అంటే చేసినట్టు కాదన్నారు. ఇక మళ్ళీ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇంకా టైమ్ ఉంది కదా.. చూద్దాం అని నవ్వారు ప్రకాశ్ రాజ్.
గత ఏడాది మా ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ - మంచు విష్ణు పోటీ పడగా..మంచు విష్ణు గెలుపొందారు. ఎప్పుడు లేనంతగా మా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికల మాదిరి ఉత్కంఠతో జరిగాయి. పోటీ పోటీ గా మాటల యుద్దాలు, ఆరోపణలతో కనీవిని ఎరుగని రీతిలో హడావిడి జరిగింది. ఫైనల్ గా మంచు విష్ణు ప్యానల్ గెలిచింది. ఈ మధ్యే ఏడాది ప్రెసిడెంట్ గా పూర్తిచేసుకన్న విష్ణు మేం ప్రకటించిన అన్ని హామీలలో 90 శాతం పూర్తి చేశాం అన్ని చెప్పారు. మా బిల్డింగ్ తో పాటు చిన్న చిన్నవి కొన్ని తప్పించి అన్న పనులు చేశాం అన్నారు.