స్పీడ్‌ పెంచిన రజనీకాంత్‌, ఒకేసారి రెండు కొత్త సినిమాలకు సైన్‌.. ముహూర్తం కూడా ఫిక్స్

Published : Oct 28, 2022, 06:39 PM ISTUpdated : Oct 28, 2022, 06:52 PM IST
స్పీడ్‌ పెంచిన రజనీకాంత్‌, ఒకేసారి రెండు కొత్త సినిమాలకు సైన్‌.. ముహూర్తం కూడా ఫిక్స్

సారాంశం

ప్రస్తుతం `జైలర్‌` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన తదుపరి చిత్రాలను ప్రకటించారు. ఒకేసారి ఆయన రెండు కొత్త సినిమాలను చేయబోతున్నారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) `పెద్దన్న` పరాజయంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అనిపించింది. కేవలం ఆయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో `జైలర్‌`(Jailer) చిత్రంలోనే నటిస్తున్నారు. నెక్ట్స్‌ చేయబోయే సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో రజనీ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వాదన విపినించింది. అయితే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో రజనీ కొంత గ్యాప్‌ తీసుకున్నా ఇప్పుడు జోరు పెంచారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ల విషయంలో స్పీడ్‌ పెంచారు. తాజాగా ఆయన ఒకేసారి రెండు సినిమాలకు సైన్‌ చేయడం విశేషం. అంతేకాదు ఒకే బ్యానర్‌లో రెండు సినిమాలు చేయడం మరో విశేషమైతే, ఆ రెండూ ఒకేసారి ప్రారంభం కాబోతుండటం ఇంకో విశేషం. 

ప్రస్తుతం `బీస్ట్` ఫేమ్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో `జైలర్‌` చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్‌. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా తనతో `2.0` చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్‌(Lyca Production) బ్యానర్‌లో రెండు సినిమాలకు సైన్‌ చేశారు రజనీకాంత్‌. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్‌ హెడ్‌ తమిల్‌ కుమారన్‌ వెల్లడించారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు నవంబర్‌ 5న చెన్నైలో జరగనున్నాయని వెల్లడించారు. 

ఈ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఛైర్మెన్‌ సుభాస్కరన్‌, డిప్యూటీ చైర్మెన్‌ ప్రేమ్‌ శివస్వామి సమర్పణలో నిర్మితం కానున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకులెవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను కూడా వెల్లడించలేదు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది నిర్మాణ సంస్థ. అయితే రజనీ సైలెంట్‌గా ఓకే సారి రెండు చిత్రాలకు సైన్‌ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ