Prakash Raj Birthday: బర్త్ డే సందర్భంగా.. పునిత్ రాజ్ కుమార్ పేరుతో ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన

Published : Mar 26, 2022, 02:13 PM ISTUpdated : Mar 26, 2022, 02:14 PM IST
Prakash Raj Birthday: బర్త్ డే సందర్భంగా..  పునిత్ రాజ్ కుమార్ పేరుతో ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన

సారాంశం

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన 58వ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగడించిన ప్రకాశ్ రాజ్ సేవాకార్యక్రమాలతో తన మంచితనం చాటుకుంటున్నారు. 

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన 58వ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగడించిన ప్రకాశ్ రాజ్ సేవాకార్యక్రమాలతో తన మంచితనం చాటుకుంటున్నారు. 

ఈరోజు ( మార్చ్ 26) విలక్షణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఓ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్ పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్టు తెలిపారు అప్పూ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓ ఫొటో ను తన ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు ప్రకాశ్ రాజు. కన్నడ నాట పునిత్ రాజ్ కుమార్ ను  అప్పుగా పిలుస్తారు.  

 

ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ కు అనుంధంగా తన ద్వారా అప్పూ ఎక్స్‌ప్రెస్ పేరుతో త‌న సేవ‌ల‌ను మ‌రింత‌ ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్ర‌కాశ్ రాజ్ చెప్పారు. అంతే కాదు ఈ విష‌యాన్ని ఆనంద‌భ‌రితంగా ప్ర‌క‌టిస్తున్నాన‌ని ప్రకాశ్ రాజ్ అన్నారు. అయితే, దీనిపై పూర్తి వివ‌రాలు చెప్ప‌లేదు ప్ర‌కాశ్. త్వరలో వీటికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తానన్నారు. ఇప్ప‌టికే తన ఫౌండేషన్‌ ద్వారా అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు ప్రకాశ్ రాజ్.

గతంలో  క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ప్రకాశ్ రాజ్  పేద‌ల‌కు సేవ‌లు అందించారు. తన ఫామ్ హౌస్ లో వలస కూలీలకు ఆశ్రయం ఇచ్చి.. తన సొంత ఖర్చులతో వారి సొంత ప్రాంతాలకు పంపించాడు ప్రకాశ్ రాజ్. ఇటు  పునీత్ రాజ్‌కుమార్ కూడా ప్ర‌జా సేవ‌లో ముందుండేవారు. తాను ఉన్నా.. లేకున్నా.. తన సేవా కార్యక్రమాలు ఆగకూడదని కొన్ని కోట్లు ముందే ఫిక్స చేసి ఉంచాడు పునిత్ రాజ్ కుమార్. త్వ‌ర‌లోనే త‌న కొత్త కార్య‌క్ర‌మంపై ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌