
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఫిదా అయ్యారు అల్లు అర్జున్ సినిమాను ఫస్ట్ డే చూసేసిన బన్నీ.. ట్రిపుల్ ఆర్ గురించి ట్విట్టర్ లో స్పందించారు. ఇంతకీ బన్నీ ఏమన్నారంటే..?
దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించి మెప్పించిన ఈ సినిమా నిన్న( మార్చ్25) రిలీజ్ అయ్యింది. కరోనా వల్ల చాలా కాలంగా గమ్ముగా ఉన్న ఇండస్ట్రీలో ట్రిపుల్ ఆర్ వల్ల జాతర స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి పెద్ద సిమాలు థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి.
ఇక ఈసినిమాను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వెంటనే చూసేస్తున్నారు. చూసి సోషల్ మీడియాలో తమ స్పందననను తెలియజేస్తన్నారు. ఇక రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రిబుల్ ఆర్ సినిమా చూసి మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఇంత గొప్ప సినిమా అందించినందుకు దర్శక ధీరుడు రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు అల్లు అర్జున్.
రాజమౌళి గారి విజన్ కు అల్లు అర్జున్ ఫిదా అయిపోయారు. తన బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని.. ఆయనను చూసి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు తన బావ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అర్జున్. తారక్ నటనను డైనమిక్ పవర్ హౌస్ తో పోల్చారు బన్నీ.
అలాగే కీలకమైన పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ నటనను కూడా పొగిడారు అల్లు అర్జున్. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత డివివి దానయ్య.. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్ తెలిపారు అల్లు అర్జున్. ఇండియా గర్వించదగ్గ త్రిబుల్ ఆర్ సినిమా ఇచ్చినందుకు అల్లు అర్జున్ టీమ్ మొత్తాన్ని అభినందించారు.