
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ఈ మూవీలో సలార్ పాత్రలో ప్రభాస్, ఆధ్య పాత్రలో శ్రుతి హాసన్ నటించనున్నారు. తొలిసారి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యాక్షన్ త్రిలర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో జగపతి బాబు ‘రాజమనార్’ పాత్రను పోషించనున్నారు. హంబుల్ ఫిల్మ్ ప్రోడక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు శ్రుతి హాసన్ ఇటీవల రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తర్వాత హిందీలో‘ద పవర్’ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలనూ నటించి ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ ‘సాలర్’, ‘ఎన్ బీకే 107’ మూవీలో నటిస్తున్నారు.
కాగా శ్రుతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటు ‘సలార్’ మూవీ యూనిట్, అటు ‘ఎన్ బీకే 107’చిత్ర యూనిట్ తమ బెస్ట్ విషేస్ తెలియజేస్తున్నాయి. కాగా ఈ బ్యూటీ ఈ ఏడాది ప్రస్తుతం 35 ఏండ్లలో అడుగు పెట్టింది.