Bhala Thandhanana : శ్రీ విష్ణు ‘భళా తందనాన’ మూవీ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన శ్రీ విష్ణు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 28, 2022, 11:57 AM IST
Bhala Thandhanana : శ్రీ విష్ణు ‘భళా తందనాన’ మూవీ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన శ్రీ విష్ణు

సారాంశం

హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రధారుడిగా డైరెక్టర్ చైతన్య దంతులూరి తెరకెక్కిస్తున్న మూవీ ‘భళా తందనాన’. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ గతంలో విడుదల చేయగా, తాజాగా టీజర్ ను విడుదల చేశారు.    

ఒక్కో సినిమాతో ఒక్కో విలక్షణ కథతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో న‌టిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తున్నారు. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. గతంలోనే ఫస్ట్ లుక్ ను కూడా మేకర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. 

తాజాగా, ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం య్యూటూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు కొంత మేర క్లాస్ లుక్ లో కనిపించిన శ్రీ విష్ణు ఈ మూవీతో మాస్ సీన్లు చూపించనున్నారు. ఫైట్ సీన్లలో శ్రీ విష్ణు టైమింగ్, ఎనర్జీ లెవల్ హైలో ఉన్నాయి. దీంతో ఆడియెన్స్ మూవీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. చేతిలో రెండు తుపాకులు పట్టుకొని చాలా ఆవేశంగా శ్రీ విష్ణు చుట్టూ ఉన్న రౌడీ గ్యాంగ్ తో పోరాడుతాడు. టీజర్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే లేదు.  టీజర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే మూవీలో శ్రీ విష్ణు  విశ్వ రూపం చూడాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

 

హీరో శ్రీ విష్ణు ఇప్పటిదాకా చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపించారు ఈ మూవీలో.. డైరెక్టర్ చైతన్య దంతులూరి డైరెక్షన్ లో కేథ‌రిన్ థ్రెసా, శ్రీ విష్ణు కెమిస్ట్రీ మరింతగా ఆకట్టుకోనుంది. ఇక ప్రతినాయకుడిగా కేజిఎఫ్ ఫేమ్ రామచంద్ర రాజు మరింత పవర్ ఫుల్‌గా కనిపించారు. అయితే శ్రీ విష్ణు చైతన్య డైరెక్షన్ లో గతంలో రిలీజైన ‘బాణం’ మూవీలో పనిచేశారు. చివరిగా ‘రాజారాజ చోర’, అర్జున ఫాల్గుణ మూవీలతో అలరించారు శ్రీవిష్ణు.

పాపులర్ ప్రొడక్షన్ హౌస్ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణి శర్మ ట్రెండీ మ్యూజిక్ ను అందిస్తున్నారు. కాగా, సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈ మూవీని ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే పక్కా రిలీజ్ డేట్ ను మాత్రం వెల్లడించలేదు మేకర్స్.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు