తెలుగు మీడియా దెబ్బేసిందని ప్రభాస్..?

Published : Sep 02, 2019, 09:05 AM ISTUpdated : Sep 02, 2019, 11:18 AM IST
తెలుగు మీడియా దెబ్బేసిందని  ప్రభాస్..?

సారాంశం

ప్రభాస్ రెండేళ్ళ కష్టం సాహో మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రిలీజైన ఈ చిత్రం బాహుబలిలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మీడియాలో రిలీజ్ కు ముందు కథనాలు తెగ వచ్చాయి. 

ప్రభాస్ రెండేళ్ళ కష్టం సాహో మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రిలీజైన ఈ చిత్రం బాహుబలిలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మీడియాలో రిలీజ్ కు ముందు కథనాలు తెగ వచ్చాయి. అయితే అదే మీడియా సాహో సినిమా చూసి పెదవి విరిచేసింది. నెగిటివ్ రివ్యూలతో ఈ సినిమాని దుమ్మెత్తిపోసింది. సినిమాలో విషయం లేకుండా కేవలం విలన్స్ తో నింపేసారని అంది. అయితే ఇది ఏ మాత్రం ఎక్సపెక్ట్ చేయలేదు సాహో టీమ్. మరీ ముఖ్యంగా ప్రభాస్. తనకు బాహుబలి తరహాలోనే ఈ సినిమాకు సపోర్ట్ ఇస్తుందని భావించాడు. 

అయితే సినిమా బాగోపోవటంతో ఇలాంటి నాశిరకం సినిమా తీసారని, అదీ లార్గోవించ్ అనే ఫ్రెంచ్ సినిమా కాపీ కొట్టారని అనటం ప్రభాస్ ని భాదిస్తోందిట. ఆయన తెలుగు మీడియా నుంచి ఇలాంటి స్పందన ఎక్సపెక్ట్ చేయలేదుట. ప్రస్తుతం యూరప్ లో హాలీడేలో ఉన్న ప్రభాస్ హిందీ మీడియా తన సినిమాని దుమ్మెత్తి పోసిందంటే అది ఎక్సపెక్ట్ చేసిందే కానీ ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలుగు మీడియా దెబ్బ వేసిందని బాధపడ్డారట. 

ప్రభాస్ హాలీడే లో ఉన్నా ఇక్కడ రివ్యూలు, వార్తలు వింటూనే ఉన్నారట.  తన స్నేహితులైన యువి క్రియేషన్స్ వారితో మాట్లాడుతూ కలెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారట. అయితే నెగిటివ్ రివ్యూలు వచ్చినా టాక్ బాగోలేకపోయినా కలెక్షన్స్ డ్రాప్ కాలేదని, ప్రేక్షకులు, అభిమానులు తనను గెలిపించారని భావిస్తున్నారట. తను  రిలీజ్ కు ముందు మీడియాతో ఇంటరాక్ట్ అయి ఇంటర్వూలు ఇచ్చాను కానీ , ఇలా మీడియా వాళ్లు దెబ్బ కొడతారని భావించలేదని ఫీలవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ