
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకు నెరేటర్‌గా పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli). రాధే శ్యామ్ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తెలుగులో జక్కన్న వాయిస్ ఓవర్ ఇస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar).. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithivi Raj).. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇప్పటికే హిందీలో బాలీవుడ్ బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) వాయిస్ ఓవర్ ఇచ్చారు.
అయితే వీరికి మేకర్స్ గతంలోనే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా తాజాగా ప్రభాస్ కూమా స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ఇందుకు తన ఇన్ స్టాలో థ్యాంక్స్ నోట్ పోస్ట్ చేశాడు. ‘అమితాబ్ బచ్చన్ సర్, శివ రాజ్‌కుమార్ సర్, పృథ్వీరాజ్ సుకుమారన్ సర్, ఎస్‌ఎస్ రాజమౌళి సర్ తమ అద్భుతమైన గాత్రాన్ని మా చిత్రం రాధే శ్యామ్ కు అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ఈ చిత్రాన్ని మాతో పాటు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా అందించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. మీకు చాలా కృతజ్ఞతలు’ అంటూ ఒక నోట్ తో కూడిన ఫొటోను పోస్ట్ చేశారు ప్రభాస్.
ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు.