
ఇటీవల కాస్టింగ్ కౌచ్ పై స్టార్ హీరోయిన్లు, నటీమణులు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్, సీనియర్ నటి ఇషా కొప్పికర్ (Isha Koppikar) కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అంతకుముందు టాలీవుడ్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి (Anushka Shetty) కూడా కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, తన జీవితంలో అలాంటి ఘటనలు చూసినట్టు చెప్పింది. కానీ తాను అన్నింట్లో చాలా కఠినంగా వ్యవహరించడంతో అలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదని తెలిపారు. కాగా, తాజాగా స్టార్ కిడ్ నటి మంచు లక్ష్మి కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.
నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఆశ్చర్యపోయే విషయాలను వెల్లడించారు. మహిళలు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపింది. తను కూడా బాధితురాలినేనని తెలిపింది. ఎంత స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ కి వచ్చినా కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోక తప్పలేదన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కూతురు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని నెటిజన్లు అంటున్నారు.
తన కెరీర్‌లో సెక్సిజం, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఎదుర్కొక తప్పలేదని, మరిన్ని పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది లక్ష్మి. ప్రపంచవ్యాప్తంగా విమెన్స్ కు ఇదొక సాధారణ సమస్య గా మారిందన్నారు. ఎలాంటి వృత్తి లోనైనా మహిళలు వీటిని ఎదుర్కొక తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ, బ్యాంకింగ్, సినిమాలు ఇలా ప్రతిచోటా ఇలాంటివి జరుగుతున్నాయని తెలిపారకు. మొదట్లో తన తండ్రి స్టార్ కాబట్టి అలాంటిదేమీ జరగదని గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు.
మంచు లక్ష్మి కేరీర్ ప్రస్తుతం సాధారణంగానే ఉంది. వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. హీరో సిద్దార్థ, శ్రుతి హాసన్ నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీలో నెగటివ్ రోల్ లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మంచు లక్ష్మి. అప్పటి నుంచి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తోంది. అటు హిందీ, తమిళంలోనూ వచ్చి ఆఫర్లను కాదనకుండా నటిస్తోంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘మా వింత గాధ వినుమ’ మూవీలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ‘పిట్ట కథలు’ మూవీలోనూ ఓ పాత్ర పోషించింది. మహారాణి, ఆహా భోజనంబు షోలకు హోస్ట్ గా వ్యవహరించింది.