ట్రెండింగ్‌లో.. ప్రభాస్‌ `సలార్‌` ఆడిషన్‌..ఊహించని రెస్పాన్‌!

Published : Dec 15, 2020, 01:43 PM IST
ట్రెండింగ్‌లో.. ప్రభాస్‌ `సలార్‌` ఆడిషన్‌..ఊహించని రెస్పాన్‌!

సారాంశం

`సలార్‌`  చిత్రంలో చాలా వరకు కొత్త కాస్టింగ్‌ని తీసుకుంటున్నారు. అందుకోసం అన్ని రకాల ఏజ్‌ గ్రూపులను చెందిన వారిని ఎంపిక చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆడిషన్‌ ప్రారంభమైంది. అయితే ఇప్పుడిది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మరోవైపు ఆడిషన్‌ కోసం భారీగా తరలి వచ్చారు. 

ప్రభాస్‌.. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `సలార్‌` చిత్రం చేయబోతున్నారు.  హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆడిషన్‌ జరుగుతుంది. ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

`సలార్‌`  చిత్రంలో చాలా వరకు కొత్త కాస్టింగ్‌ని తీసుకుంటున్నారు. అందుకోసం అన్ని రకాల ఏజ్‌ గ్రూపులను చెందిన వారిని ఎంపిక చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆడిషన్‌ ప్రారంభమైంది. అయితే ఇప్పుడిది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మరోవైపు ఆడిషన్‌ కోసం భారీగా తరలి వచ్చారు. భారీ క్యూలో ఉన్నారు. `సలార్‌` ఆడిషన్‌కి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం విశేషం. వీరంతా డిటైల్స్ ఇచ్చేందుకు వచ్చారు. ఈ నెల పదిహేడునుంచి ఆడిషన్‌ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. 

ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. 2022లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాజుకి రైట్‌ హ్యాండ్‌ తరహాలో ఉండే అత్యంత హింసాత్మకమైన నాయకుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. మరి దీన్ని ఎప్పుడు చేస్తాడనేది సస్పెన్స్ నెలకొంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు