సలార్ 3డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్... ప్రభాస్ ఇంకెంత రాబట్టాలంటే?

Published : Dec 25, 2023, 01:17 PM IST
  సలార్ 3డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్... ప్రభాస్ ఇంకెంత రాబట్టాలంటే?

సారాంశం

సలార్ మూవీ వరల్డ్ వైడ్ సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. మూడో రోజు ఆదివారం మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సలార్ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి...   

ప్రభాస్ మాస్ కట్ అవుట్ కి సెట్ అయ్యే మూవీ పడితే బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో సలార్ నిరూపించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ డిసెంబర్ 22న విడుదల చేశారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సలార్ ఫస్ట్ డే సత్తా చాటింది. 2023కి గాను హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. సలార్ లియో రికార్డు బ్రేక్ చేసింది. 

సలార్ చిత్రానికి ఇండియా వైడ్ ఆదరణ లభిస్తుంది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సలార్.. రూ. 22.40 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో మూడు రోజులకు రూ.93.92 కోట్ల షేర్, రూ. 140.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక వరల్డ్ వైడ్ వసూళ్లు గమనిస్తే... కర్ణాటక రూ.13.35 కోట్లు, తమిళనాడు రూ.5.80 కోట్లు, కేరళ రూ.4.05 కోట్లు, హిందీ, రెస్టాఫ్ ఇండియా రూ.29.75 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో రూ. 38.80 కోట్లు వసూలు చేసింది. 

వరల్డ్ వైడ్ మూడు రోజులకు రూ.185.67 కోట్ల షేర్,  రూ.330 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సలార్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రూ. 347 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. మరో రూ. 161.33 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆదివారం ఆదిపురుష్ మంచి వసూళ్లు అందుకుంది. నేడు పండగ దినం. న్యూ ఇయర్ వరకు ఫెస్టివ్ మూడ్ ఉంటుంది. 

సలార్ వసూళ్లు నిలకడగా ఉంటే బ్రేక్ ఈవెన్ కష్టం కాదు. ఓవర్సీస్ లో సలార్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇక సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్ 1లో మిత్రులుగా కనిపించిన పృథ్విరాజ్, ప్రభాస్ పాత్రలు... పార్ట్ 2 లో బద్దశత్రువులుగా టర్న్ అవుతాయట. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరీ రావు కీలక రోల్స్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..