
ప్రాజెక్ట్ కే ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్ర కథపై అనేక ఊహాగానాలున్నాయి. ఒక్కొక్కటిగా బయకు వస్తున్న డీటెయిల్స్ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నారట.
దేశంలో ఏ టాప్ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న దాఖలాలు లేవు. పూజా, రష్మిక మందాన వంటి స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ రూ. 4 కోట్లకు లోపే. అలాంటిది దీపికా పది కోట్లు ఛార్జ్ చేయడం ఆమె క్రేజ్ కి నిదర్శనం. అది దాదాపు ఒక టైర్ టూ హీరో రెమ్యూనరేషన్ కి సమానం. ఇటీవల దీపికా నటించిన పఠాన్ మూవీ భారీ హిట్ కొట్టింది. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్ ఏకంగా వెయ్యి కోట్ల మార్క్ దాటింది.
ఇదిలా ఉంటే దీపికా పదుకొనె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే పుకారుంది. చాలా కాలంగా దీపికా పదుకొనెకి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమె తీవ్ర డిప్రెషన్ కి గురైంది. గత ఏడాది ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా ఆమె సడన్ గా అనారోగ్యం బారినపడ్డారట. దీపికాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. దీపికా పదుకొనె అనారోగ్య సమస్యలు ప్రాజెక్ట్ కే చిత్రానికి సమస్యగా మారాయనే వాదన కూడా వినిపించింది.
అయితే నిర్మాతలు అవి పుకార్లుగా కొట్టిపారేశారు. బీపీ వలన దీపికకు కళ్లు తిరిగాయని స్పష్టత ఇచ్చారు. ప్రాజెక్ట్ కే విడుదల తేదీ కూడా ప్రకటించారు. 2024 జనవరి 12న ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.