ఎట్టకేలకు బయటకు వచ్చిన పూరీ - ఛార్మి.. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే..?

Published : Mar 07, 2023, 03:37 PM ISTUpdated : Mar 07, 2023, 04:14 PM IST
ఎట్టకేలకు బయటకు వచ్చిన పూరీ - ఛార్మి.. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే..?

సారాంశం

చాలా కాలం అజ్ఞాతంలో గడిపిన హీరోయిన్ ఛార్మీ .. రీసెంట్ గా కనిపించింది. చాలా కాలం తరువాత ఆమె బయట కనిపించింద. అది కూడా పూరీ జగన్నాథ్ తోనే కలిసి సందడి చేసింది.   

తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో ఛార్మితో కలిసి కెమెరాలకు పోజులిచ్చాడు పూరీ జగన్నాథ్. గత కొన్నాళ్ల నుంచి కలిసి సినిమాలు నిర్మిస్తున్న పూరీ-ఛార్మీ.. ముంబయి- హైదరాబాద్, హైదరాబాద్-ముంబయికి తిరుగుతూ ఉంటారు. ఇక లైగర్ ఫ్లాప్ తో చాలా డిస్ట్రబ్ అయిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత దాదాపు 8  నెలల నుంచి పెద్దగా బయట ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు కూడా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారో ఏమో.. మళ్ళీ బయట కనిపించడం మొదలుపెట్టారు. అసలు వీరు ముంబయ్ ఎందుకు వెళ్ళారు అంటూ.. ఫ్యాన్స్ నుంచి వస్తున్న  ప్రశ్నలకు.. సినిమా  కోసమే వెళ్లారేమో అని సమాధానం వినిపిస్తుంది. 

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తీయాల్సిన జనగణమన అర్థాంతరంగా ఆపేసిన తర్వాత.. పూరీ కొత్త ప్రాజెక్ట్ ఏం అనౌన్స్ చేయలేదు. లైగర్ దెబ్బకు ముఖంలో నవ్వు కనిపించలేదు చాలా కాలంగా.. అలాంటిది పూరీ ప్రస్తుతం  నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్ కు సంతోషంగా అనిపించింది. ఎన్నో ఆశలతో.. భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు లైగర్ సినిమాను. అంతే కాదు సినిమా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో  ప్రమోషన్స్ కూడా చేశారు. కాని భారీ స్థాయిలో డిజాస్టార్ గా నిలిచింది లైగర్. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమా నష్టాలను మిగిల్చింది. 

ఈసినిమా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నాడు పూరీ జగన్నాథ్. అది సక్సెస్ అయ్యి ఉంటే.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ప్రాజెక్ట్ ను అట్టహాసంగా విజయ్ తో తెరకెక్కించాలి అనుకన్నాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటు.. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు పూరీ. అంతే కాదు విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ను కూడా అనౌన్స్ చేశారు. చివరకు లైగర్ ఇచ్చిన షాక్ తో .. అంతా సైలెంట్ అయిపోయారు. అసలు జనగణమన సినిమా ఉంటుందా..? లేదా..? అదేది కూడా క్లారిటీ ఇవ్వలేదు టీమ్. మరి కాస్త విరామం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తారా అనేదిచూడాలి. 

అటు లైగర్ సినిమాతో ముంబయ్ తో పూరీ కనెక్షన్స్ కట్ అయ్యాయి అనుకున్నారంతా.. అంతే కాదు ఈ బాధలో తన కో ప్రోడ్యూసర్ అయిన ఛార్మీ కూడా బాగా ఎపెక్ట్ అయ్యింది. ఆమె విమర్షలు తట్టుకోలేక తన సోషల్ మీడియా పేజ్ కు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది. బై చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బయట ఎక్కడా కనిపించలేదు ఛార్మీ. ఇక ఇన్నాళ్లకు పూరీతో కలిసి ఛార్మీ కనిపించడం.. అది కూడా ముంబయ్ లో కనిపించడంతో.. ఇంకేదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారన్నహోప్స్ పెరిగిపోయాయి ఫ్యాన్స్ లో.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..