పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు.
‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన డెరెక్టర్ సందీప్ రెడ్డి వంగ త్వరలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రానికి ‘స్పిరిట్’(Spirit) అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ లిస్టులో ఆదిపురుష్ షూటింగ్ పూర్తై రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ‘సలార్’, నాగ్ అశ్విన్ తో దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు పార్లల్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పార్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు దర్శకుడు మారుతీ దర్శకత్వంలోనూ ప్రభాస్ కు సంబంధించిన ఓ సినిమాను రెడీ అవుతుందని, సైలెంట్ షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక డార్లింగ్ లైనప్ లో ఉన్న మరో చిత్రం ‘స్పిరిట్’. Sandeep reddy Vanga డైరెక్షన్ లో రాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఆసక్తికరమైన అప్డేట్ అందించారు.
ప్రభాస్ - సందీప్ రెడ్డి కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించబోతున్నారు. అయితే, ఇటీవల సినిమాపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ‘స్పిరిట్’ చిత్రం పనులు ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ‘యానిమల్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘స్పిరిట్’ను తెరకెక్కించనున్నారన్నారు.
ఇక ఈ చిత్రంతో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు. సినిమా పోలీస్ డ్రామాగా తెరకెక్కనుందని, ప్రభాస్ ను ఫ్యాన్స్ మునుపెన్నడూ చూడని విధంగా చూస్తారని హామీనిచ్చారు. చిత్రానికి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించిన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను ఏస్థాయిలో చూపించబోతున్నారోనని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు త్వరగా అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.