బాలీవుడ్ పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్!

Published : May 01, 2019, 02:45 PM ISTUpdated : May 01, 2019, 02:46 PM IST
బాలీవుడ్ పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్!

సారాంశం

బాహుబలి అనంతరం వెండితెరకు నిజంగానే ప్రభాస్ రాజయ్యాడని చెప్పవచ్చు. సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు

బాహుబలి అనంతరం వెండితెరకు నిజంగానే ప్రభాస్ రాజయ్యాడని చెప్పవచ్చు. సాహో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ సినిమాపై అంచనాలు గట్టిగానే పెంచేసుకుంటున్నారు. ఓ విధంగా బాహుబలితో ప్రభాస్ మత్తు హిందీ ప్రేక్షకులకు గట్టిగానే ఎక్కేసింది.  

అయితే ప్రభాస్ కి కూడా అదే తరహాలో హిందీ మత్తెక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని సాహో తో పాటు రాధాకృష్ణ డైరెక్షన్ లో చేస్తోన్న లవ్ స్టోరీని కూడా హిందీలో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు. బాహుబలి ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం చేజారనివ్వకూడదని మంచి కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

ప్రత్యేకంగా హిందీ ఆడియెన్స్ కోసం కూడా కొన్ని కథలను వింటున్నాడట. చేసే ప్రతి సినిమా బాహుబలి స్థాయిలో బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవ్వాలని సరికొత్తగా అడుగులువేస్తున్నాడు. డైరెక్ట్ గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో కూడా రెబల్ స్టార్ టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. నిర్మాత కరణ్ జోహార్ ప్రభాస్ దొరికితే మంచి సినిమా తెరకెక్కించాలని చూస్తున్నాడు. మరి ప్రభాస్ ఆలోచనా విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?