‘బాహుబలి’వల్లే గుర్తింపు..కానీ సమస్యలు తెచ్చిపెట్టింది

Published : Aug 24, 2019, 10:23 AM IST
‘బాహుబలి’వల్లే గుర్తింపు..కానీ సమస్యలు తెచ్చిపెట్టింది

సారాంశం

‘‘బాహుబలి’ వల్ల నాకు గుర్తింపు లభించి ఉండొచ్చు. కానీ స్వేచ్ఛ పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, కొన్ని దేశాల్లోని వారికి నేను తెలుసు. ఇంతకు ముందు చాలా సార్లు ముంబయికి వచ్చాను. అప్పుడు నన్నెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, దగ్గరికి వస్తున్నారు. ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయాను’అన్నారు ప్రభాస్.  

‘బాహుబలి’ వల్ల నాకు గుర్తింపు లభించి ఉండొచ్చు. కానీ స్వేచ్ఛ పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, కొన్ని దేశాల్లోని వారికి నేను తెలుసు. ఇంతకు ముందు చాలా సార్లు ముంబయికి వచ్చాను. అప్పుడు నన్నెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, దగ్గరికి వస్తున్నారు. ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయాను’అన్నారు ప్రభాస్.

‘సాహో’ సినిమా తెలుగుతోపాటు వివిధ భాషల్లో ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘సాహో’ చిత్రం ప్రమోషన్స్ లో ప్రభాస్ కంటిన్యూగా పాల్గొంటున్నాడు. ఈ  ప్రచారంలో భాగంగా ప్రభాస్‌ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తనపై ఉన్న మానసిక ఒత్తిడి గురించి ప్రస్తావించారు. ‘సాహో’ సినిమా స్క్రిప్టు వల్ల, దర్శకుడు సుజీత్‌ వల్ల ఎటువంటి టెన్షన్ లేదని, కానీ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తనకు ఇచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి’ వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని అన్నారు.

ప్రభాస్ కంటిన్యూ చేస్తూ.. ‘గుజరాత్‌లోని పిల్లలు ‘బాహుబలి’ పాటలు పాడుతున్నారని నా ప్రెండ్ చెప్పాడు. ఏ  ఏరియావాళ్లు నన్ను ఇష్టపడుతున్నారో కూడా తెలియడం లేదు. కాబట్టి చాలా టెన్షన్ గా, ఒత్తిడిగా ఉంది. కొన్ని సార్లు భయమేస్తోంది. ‘సాహో’ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా, గడుపుతున్నా. దీని వల్ల చాలా రోజులు కంటిమీద కునుకు లేదు’ అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్